Jio AirFiber Data Offer : జియో ఎయిర్‌ఫైబర్ యూజర్ల కోసం సరికొత్త 3 డేటా బూస్టర్ ప్లాన్లు ఇవే.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Jio AirFiber Data Offer : రిలయన్స్ జియో ఎయిర్‌ఫైబర్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల కోసం 5జీ టెక్నాలజీతో హైస్పీడ్ ఇంటర్నెట్ సర్వీసును అందిస్తోంది. లేటెస్టుగా 3 డేటా బూస్టర్ ప్లాన్లను తీసుకొచ్చింది.

Jio AirFiber Data Offer : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ఎయిర్‌ఫైబర్ సర్వీసులను భారత నగరాల్లో క్రమంగా అందుబాటులోకి తెస్తోంది. హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని 5జీ టెక్నాలజీ ద్వారా అందించే వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్. జియో ఎయిర్‌ఫైబర్ ఇంటర్నెట్ వేగాన్ని 1Gbps వేగంతో అందించగలదు. సాంప్రదాయ ఫైబర్-ఆప్టిక్ కనెక్షన్‌ల మాదిరిగానే వేగవంతమైనది. అయితే, 1.5Gbps వరకు ఇంటర్నెట్ స్పీడ్‌తో నివాస, కార్యాలయ వినియోగం కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రస్తుతం జియో అందించే జియోఎయిర్‌ఫైబర్ (JioAirfiber) కనెక్షన్ 500 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు మరింత అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో కంపెనీ డేటా స్పీడ్, ఇతర అదనపు బెనిఫిట్స్ ఆధారంగా డేటా ప్లాన్ల పరిధిని విస్తరిస్తోంది. అందులో ఒకటి డేటా బూస్టర్ ప్లాన్.. ఈ డేటా పోస్ట్ ఫెయిర్ పాలసీ ప్రకారం.. వినియోగదారులు తమ రోజువారీ డేటా అలవెన్స్‌ని ఉపయోగిస్తే రీఛార్జ్ చేసుకోవచ్చు.

Read Also : Best Phones in India 2024 : ఈ ఫిబ్రవరిలో రూ.15వేల లోపు ధరలో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫుల్ లిస్ట్ మీకోసం..!

జియో ప్రకారం.. ఎయిర్‌ఫైబర్ యూజర్లు నెలకు 1TB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. అయితే, ఈ లిమిట్ చేరుకున్న తర్వాత డేటా స్పీడ్ ఒక్కసారిగా తగ్గుతుంది. వినియోగదారులకు మరిన్ని డేటా ఆప్షన్లను అందించడానికి జియో రూ. 101 నుంచి డేటా బూస్టర్ ప్యాక్‌లను అందిస్తుంది. 1TB కన్నా ఎక్కువ హై-స్పీడ్ డేటా అవసరమయ్యే వినియోగదారులు స్పీడ్ బూస్ట్ పొందడానికి ఈ ప్యాక్‌లను ఎంచుకోవచ్చు.

జియో ఎయిర్‌ఫైబర్ డేటా బూస్టర్ ప్లాన్ వివరాలివే :
జియో ఎయిర్‌ఫైబర్ అదనపు డేటా కోసం ఏదైనా బేస్ ప్లాన్‌కి యాడ్ చేసే 3 డేటా బూస్టర్ ప్లాన్‌లను అందిస్తోంది.

  • జియో ఎయిర్‌ఫైబర్ డేటా బూస్టర్ రూ. 101 ప్లాన్ : ఈ ప్లాన్ మీ బేస్ ప్లాన్‌తో సమానమైన స్పీడ్‌తో 100జీబీ అదనపు డేటాను అందిస్తుంది.
  •  జియో ఎయిర్‌ఫైబర్ డేటా బూస్టర్ రూ. 251 ప్లాన్ : ఈ ప్లాన్‌తో మీ బేస్ ప్లాన్ మాదిరిగానే అదే వేగంతో 500జీబీ అదనపు డేటాను పొందవచ్చు.
  •  జియో ఎయిర్‌ఫైబర్ డేటా బూస్టర్ రూ. 401 ప్లాన్ : మీ బేస్ ప్లాన్ మాదిరిగానే అదే స్పీడ్‌తో 1000GB డేటా టాప్ అప్ పొందవచ్చు.

ఈ డేటా బూస్టర్ ప్లాన్‌లకు సొంత వ్యాలిడిటీ లేదని గమనించాలి. ఈ ప్లాన్లను యాక్టివేట్ చేయడానికి బేస్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాలి. మీరు కొత్త జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్‌తో లేదా నెలవారీ ప్లాన్‌గా ఉపయోగించవచ్చు. మీరు ఒకే బిల్లింగ్ సైకిల్‌లో అనేక సార్లు ఈ డేటా బూస్టర్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేయవచ్చు. అదనంగా, డేటా బూస్టర్ ప్లాన్‌ల స్పీడ్.. మీ జియోఎయిర్ ఫైబర్ బేస్ ప్లాన్ స్పీడ్ అందిస్తుంది.

 Jio AirFiber users 

ఉదాహరణకు, మీ బేస్ ప్లాన్ 100Mbps అయితే.. మీ డేటా బూస్టర్ ప్లాన్ కూడా 100Mbps స్పీడ్‌తో 1TB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లతో రీఛార్జ్ చేయడానికి MyJio లేదా Jio.comని సందర్శించండి. ఇప్పుడు, జియో, ఇతర టెలికాం ఆపరేటర్లు తమ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ ప్లాన్‌లలో కూడా డేటా వినియోగాన్ని ఎందుకు పరిమితం చేస్తారో తెలుసా? దీనికి ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) అనే విధానం కారణమని చెప్పవచ్చు.

డేటా పోస్ట్ ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) అంటే ఏమిటి? :
భారత టెలికం మార్కెట్లో డేటా FUP బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రకారం.. మీ నెలవారీ డేటా ముగిసిన తర్వాత యాక్సెస్ చేయగల డేటా మొత్తాన్ని లెక్కిస్తుంది. వేర్వేరు ప్రొవైడర్లు వేర్వేరు FUP కలిగి ఉన్నారు. కొంతమంది ఆపరేటర్లు మీ ఇంటర్నెట్ వేగాన్ని తక్కువ స్థాయికి తగ్గిస్తారు లేదా పరిమితికి మించి ఉపయోగించిన డేటా కోసం అదనపు రుసుములను వసూలు చేస్తారు. ఇతరులు డేటా బూస్టర్ ప్లాన్‌లతో జియో అందిస్తున్నట్లుగానే అదనపు డేటా ప్యాక్‌లను కొనుగోలు చేసే ఆప్షన్ కూడా అందిస్తారు.

FUPకి రెండు ప్రధాన కారణాలివే :
ఈ విధానం అందరికీ న్యాయమైన, అనుకూలమైన నెట్‌వర్క్ వినియోగాన్ని అందిస్తుంది. కొంతమంది వినియోగదారులు భారీ ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడం లేదా స్ట్రీమ్ చేయడం ద్వారా అధిక డేటాను వినియోగించుకోవచ్చు. నెట్‌వర్క్‌ను షేర్ చేసే ఇతరులకు ఇంటర్నెట్ స్పీడ్, క్వాలిటీపై ప్రభావం చూపుతుంది. FUP అటువంటి అధిక వినియోగాన్ని పరిమితం చేయడంలో అందరికీ స్పీడ్ సర్వీసును అందించడంలో సాయపడుతుంది.

పీక్ అవర్స్‌లో నెట్‌వర్క్ రద్దీని నివారించడం మరో కారణంగా చెప్పవచ్చు. చాలా మంది వినియోగదారులు ఏకకాలంలో ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు, నెట్‌వర్క్ రద్దీ ఏర్పడవచ్చు. FUP ఈ పీక్ సమయాల్లో అధిక వినియోగాన్ని తగ్గిస్తుంది. స్పీడ్ తగ్గించడం లేదా అదనపు ఛార్జింగ్ చేయడం ద్వారా అందరికీ మెరుగైన నెట్‌వర్క్‌ను అనుమతిస్తుంది.

Read Also : Instagram Edit Message : ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. పంపిన మెసేజ్ ఇకపై ఎడిట్ చేయొచ్చు.. కేవలం 15 నిమిషాల్లోపు మాత్రమే..!

ట్రెండింగ్ వార్తలు