Rs. 4000 లకే Jio Smart Phone!

  • Publish Date - September 23, 2020 / 10:15 AM IST

Reliance Industries Ltd : టెలికాం రంగంపై పట్టు సాధించేందుకు రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే 40 కోట్ల మందికి పైగా..దేశీయ టెలికాం విపణిలో అగ్రగామిగా అవతరించంది. అయితే..మరింత పట్టు సాధించేందుకు పటిష్టమైన ప్రణాళికలు రచిస్తోంది. స్మార్ట్ ఫోన్ల విషయంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలను టార్గెట్ చేయాలని ఈ సంస్థ భావిస్తోందని సమాచారం.



మార్కెట్ లో ప్రస్తుతం ఖరీదైన సెల్ ఫోన్ లు ఉన్నాయని, చవకైన ఫోన్లను అందించాలని రిలయెన్స్ జియో భావిస్తోంది. కేవలం రూ. 4వేల ధర ఉండాలని నిర్ణయించింది. స్థానిక తయారీదార్లతో కలిసి రిలయెన్స్ జియో పని చేస్తోందని సమాచారం. రాబోయే రెండేళ్లలో 20 కోట్ల స్మార్ట్ ఫోన్లు వినియోగదారులకు అందించేందుకు వీలుగా, తయారీ సామర్థ్యం పెంచుకోవాలని చూస్తోందని బ్లూమ్ బర్గ్ వెల్లడించింది.



స్మార్ట్ ఫోన్ తయారీ ప్రాజెక్టు కోసం గూగుల్ కూడా రిలయెన్స్ జియో లో 4.5 బిలయన్ డాలర్లు పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. జియో నెల వారి పథకాలతో అనుసంధానం చేసి, వీటిని విక్రయించనున్నారని సమాచారం. స్మార్ట్ ఫోన్లను రెండేళ్లలో 15-20 కోట్ల మేర విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాల వల్ల దేశీయ తయారీ సంస్థలకు ఊతం లభించనుందని అంచనా వేస్తున్నారు. Deepavali పండుగ సమయానికి వస్తుందని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు