Jio Recharge Plans : జియో బంపర్ ఆఫర్.. ఈ ప్లాన్లలో ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!
Jio Recharge Plans : జియో యూజర్ల కోసం సరికొత్త సరసమైన రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 1000 లోపు ధరలో ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ అందిస్తోంది. ఈ ఓటీటీ బెనిఫిట్స్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- September 9, 2026 / 05:46 PM IST
Jio Recharge Plans
- రూ. 1000 లోపు ధరలో జియో ఓటీటీ ప్లాన్లు ఇవే
- జియోలో మొత్తం 3 ప్లాన్‌లు ఉన్నాయి
- రూ. 200 ప్లాన్‌లో అదనపు డేటా, OTT బెనిఫిట్స్
- రూ. 500, రూ. 550 ప్లాన్‌లతో మరింత డేటా
Jio Recharge Plans : జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఓటీటీ బెనిఫిట్స్ అందించే మంచి ప్లాన్ల కోసం చూస్తున్నారా? జియో ప్లాన్లతో అమెజాన్ ప్రైమ్ ఉచితంగా పొందొచ్చు తెలుసా? అది ఎలాగంటారా? మీరు జియో యూజర్ అయితే ఇది సాధ్యమే.. ఈ టెలికాం దిగ్గజం ఫ్రీ అమెజాన్ ప్రైమ్‌తో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే రూ. 1,000 లోపు బెస్ట్ జియో ప్లాన్‌లను ఇప్పుడు తెలుసుకుందాం..
జియో రూ. 200 ప్రీపెయిడ్ ప్లాన్ :
OTT ఎంటర్‌టైన్‌మెంట్, అదనపు డేటాను కోరుకునే కస్టమర్లకు జియో రూ. 200 ప్రీపెయిడ్ ప్లాన్ అత్యంత సరసమైన ప్లాన్. 28 రోజుల వ్యాలిడిటీతో (Jio Recharge Plans) వస్తుంది. ఇందులో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. అంతేకాదు.. అర్హులైన కస్టమర్లకు 30GB ఫిక్స్‌డ్ 4G/5G డేటా, అన్ లిమిటెడ్ 5జీ డేటా కూడా అందిస్తుంది. 30GB కోటా తర్వాత డేటా స్పీడ్, 64Kbpsకి తగ్గుతుంది.
ఈ రీఛార్జ్ కేవలం డేటాకు మాత్రమే. ఇందులో వాయిస్ కాలింగ్, SMS బెనిఫిట్స్ లేవు. యాక్టివ్ బేస్ ప్లాన్ తప్పినిసరి. ఎంటర్‌టైన్‌మెంట్ విషయానికి వస్తే.. సబ్‌స్క్రైబర్‌లు జియోటీవీ ద్వారా యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్, జియోహాట్‌స్టార్ మొబైల్, అనేక ఇతర ఓటీటీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ప్లాన్‌లో 1,000 కన్నా ఎక్కువ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్ పొందొచ్చు.
జియో రూ. 500 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఆల్-ఇన్-వన్ రీఛార్జ్ కోరుకునే కస్టమర్ల కోసం జియో రూ. 500 ప్రీపెయిడ్ ప్లాన్, రోజువారీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, అనేక రకాల ఎంటర్‌టైన్‌మెంట్ బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తుంది. రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అందిస్తుంది. అర్హత గల కస్టమర్లు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను కూడా పొందొచ్చు.
అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ ప్రీమియం, జియోహాట్‌స్టార్ మొబైల్‌తో సహా 15 ప్రీమియం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ అందిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఈ ప్లాన్‌లో స్పెషల్ అట్రాక్షన్. ఈ ప్లాన్‌లో జియోగేమ్స్ మొబైల్, రూ. 35,100 విలువైన 18 నెలల గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్ కూడా పొందొచ్చు. ఆసక్తిగల యూజర్లు అదనంగా 5,000GB క్లౌడ్ స్టోరేజ్‌తో పాటు నానో బనానా, జెమిని లైవ్ వంటి ఫీచర్లను కూడా యాక్సస్ పొందొచ్చు.
జియో రూ. 550 ప్రీపెయిడ్ ప్లాన్ :
జియో రూ. 550 రీఛార్జ్, లాంగ్ టైమ్ డేటా, ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ కస్టమర్లకు అందుబాటులో ఉంది. 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అర్హులైన కస్టమర్లకు అన్ లిమిటెడ్ 5జీ డేటాతో పాటు 90GB ఫిక్స్‌డ్ 4G/5G డేటాను అందిస్తుంది. రూ. 200 రీఛార్జ్ మాదిరిగానే కేవలం డేటా ప్లాన్ మాత్రమే.. ఇందులో వాయిస్ కాలింగ్ లేదా SMS బెనిఫిట్స్ ఉండవు. ఈ రీఛార్జ్ కోసం యాక్టివ్ బేస్ ప్లాన్ తప్పనిసరి.
ఎంటర్‌టైన్మెంట్ కోసం సబ్‌స్క్రైబర్‌లు యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ లైట్, సోనీలివ్, జీ5, జియోహాట్‌స్టార్ మొబైల్‌తో సహా 15 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ పొందవచ్చు. ఈ ప్యాకేజీ 1,000 కన్నా ఎక్కువ టీవీ ఛానెల్‌లకు కూడా యాక్సెస్ అందిస్తుంది. ప్రధానంగా డేటా, ఓటీటీ కంటెంట్‌పై ఆసక్తి ఉన్న కస్టమర్లకు లాంగ్ వ్యాలిడిటీ ఆప్షన్ అని చెప్పొచ్చు.
