Jio Prepaid Plan Offers : జియో ప్రీపెయిడ్ ప్లాన్లపై క్యాలెండర్ నెల వ్యాలిడిటీ.. ప్రతినెలా ఒకే తేదీన రీఛార్జ్ చేసుకోవచ్చు!
Jio Prepaid Plan Offers : రిలయన్స్ జియో యూజర్లకు అలర్ట్. ఇకపై జియో ప్రీపెయిడ్ యూజర్లు క్యాలెండర్ నెల వ్యాలిడిటీతో ప్లాన్లను పొందవచ్చు. ప్రస్తుతం జియో రూ.259 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఎన్ని రోజులు అనేది సంబంధం లేకుండా పూర్తి నెల పాటు వ్యాలిడిటీని అందిస్తుంది.

Jio Rs 259 prepaid plan offers full 1-month validity and unlimited benefits check details
Jio Prepaid Plan Offers : రిలయన్స్ జియో యూజర్లకు అలర్ట్. ఇకపై జియో ప్రీపెయిడ్ యూజర్లు క్యాలెండర్ నెల వ్యాలిడిటీతో ప్లాన్లను పొందవచ్చు. ప్రస్తుతం జియో రూ.259 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఎన్ని రోజులు అనేది సంబంధం లేకుండా పూర్తి నెల పాటు వ్యాలిడిటీని అందిస్తుంది. టెలికాం ఆపరేటర్లు సాధారణంగా నెలవారీ ప్లాన్‌లను 28 రోజుల వ్యాలిడిటీతో అందిస్తారు. క్యాలెండర్ నెలకు భిన్నంగా ఉంటుంది. తద్వారా వార్షిక రీఛార్జ్‌ల లిమిట్ పెరుగుతుంది.
ఇప్పుడు జియో రూ. 259 ప్రీపెయిడ్ ప్లాన్ నెలవారీ వ్యాలిడిటీతో అందిస్తోంది. దాంతో జియో కస్టమర్‌లు తమ రీఛార్జ్‌లను సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు. ముందుగా క్యాలెండర్ నెల వ్యాలిడిటీ ప్లాన్‌ను ప్రవేశపెట్టిన మొదటి టెలికాం ఆపరేటర్ కూడా జియోనే. నెలవారీ వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను అందించాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెల్కోలను ఆదేశించిన తర్వాత జియో ప్రీపెయిడ్ ప్లాన్ రూపొందించింది.

Jio Rs 259 prepaid plan offers full 1-month validity and unlimited benefits check details
జియో యూజర్లలో ఏడాదిలో చేయాల్సిన రీఛార్జ్‌ల సంఖ్యను తగ్గించేందుకు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు టెల్కో దిగ్గజం పేర్కొంది. రూ. 259 ప్లాన్ రిలయన్స్ జియో కొత్త, ఇప్పటికే ఉన్న యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ రీఛార్జ్ నుంచి సరిగ్గా 1 నెల పాటు ఉంటుంది.
ఉదాహరణకు.. మీరు మీ జియో ఫోన్‌ని అక్టోబర్ 1న రీఛార్జ్ చేసుకుంటే.. మీ తర్వాతి రీఛార్జ్ తేదీ నవంబర్ 1 అవుతుంది. నెలలోని మొత్తం రోజుల సంఖ్యతో ప్లాన్ ప్రభావితం కాదని గుర్తించుకోవాలి. సాధారణంగా నెలలో 28 రోజులు, 30 రోజులు లేదా 31 రోజులు కావచ్చు. మీ రీఛార్జ్ తేదీ అదే తేదీన మీ ప్లాన్ గడువు ముగుస్తుంది. మీరు నెలవారీ రీఛార్జ్ ప్లాన్‌ని పొందాలనుకుంటే.. మీరు రూ. 259 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకోవచ్చు. ఇంతకీ ఈ ప్లాన్ ద్వారాజియో ఎలాంటి ఆఫర్ అందిస్తుందో ఓసారి లుక్కేయండి.
జియో రూ. 259 నెలవారీ వ్యాలిడిటీ ప్లాన్..
* 1 నెల ప్యాక్ వ్యాలిడిటీని అందిస్తుంది.
* 1.5GB రోజువారీ హై-స్పీడ్ డేటా
* అపరిమిత వాయిస్ కాలింగ్
* రోజుకు 100 SMS
* Jio TV, Jio సినిమా, Jio సెక్యూరిటీ, Jio క్లౌడ్ వంటి Jio యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. మీరు రూ. 259 ప్లాన్‌తో మొత్తం ఏడాదికి ఒకేసారి రీఛార్జ్ చేసుకోవచ్చు. మల్టీ రీఛార్జ్‌లను కొనుగోలు చేయవచ్చు. మీ ప్లాన్‌లు క్యూలో యాడ్ చేయవచ్చు. మీ ప్రస్తుత రీఛార్జ్ ప్లాన్ ముగిసిన తర్వాత ముందస్తు రీఛార్జ్ ప్లాన్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది.