Jio vs Airtel Rs 2999 yearly Plan _ Check who offers better benefits
Jio vs Airtel Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) తమ వినియోగదారుల కోసం ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్లాన్లను ప్రత్యేకమైన ధరకే అందిస్తున్నాయి. టెలికం యూజర్లను ఆకట్టుకునేందుకు పోటీదారు ఇతర టెల్కోలతో పోటీగా సరికొత్త ప్లాన్లను అందిస్తున్నాయి. జియో ఇప్పటికే కొన్ని ప్లాన్లపై ఆప్షన్లను అందిస్తుండగా.. ఎయిర్‌టెల్ మరిన్ని డీల్స్ అందించేందుకు ప్రయత్నిస్తుంది.
టెలికం సర్వీస్ ప్రొవైడర్లు తమ ప్లాన్ల ధరలను ఒకేలా అందిస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్ ఒకే ధరలో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. జియో, ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల లిస్టులో రూ. 2999 వార్షిక ప్లాన్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ 365 రోజుల వార్షిక వ్యాలిడిటీ కాలింగ్, డేటా వంటి అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది. అయితే ఈ వార్షిక ప్లాన్‌ను ప్రత్యేకంగా జియో, ఎయిర్‌టెల్ రెండూ అదనపు ఆఫర్లను అందిస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్ అందించే రూ. 2999 ప్రీపెయిడ్ ప్లాన్‌ను వివరంగా పరిశీలిద్దాం. ఏ టెలికాం ఆపరేటర్ బెస్ట్ ప్లాన్లను అందిస్తుందో ఓసారి పరిశీలిద్దాం.
Jio vs Airtel రూ. 2999 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలివే :
Jio రూ. 2999 ప్లాన్ : రూ. 2999తో రీఛార్జ్ చేసుకునే యూజర్లు 2.5GB రోజువారీ లిమిట్‌తో 912.5GB మొత్తం ఇంటర్నెట్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అదనంగా, Jio ప్రస్తుతం ఈ వార్షిక రీఛార్జ్ ప్లాన్ కింద ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది.
Jio హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ బెనిఫిట్స్ కింద యూజర్లు ఈ ప్లాన్‌లో అదనపు 75GB డేటాతో 23 రోజుల అదనపు వ్యాలిడిటీని పొందవచ్చు. వినియోగదారులు 987.5GB మొత్తం డేటాతో 388 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. Jio యూజర్లలో JioTV, JioCinema, JioSecurity, Jio క్లౌడ్‌తో సహా Jio యాప్‌లకు కూడా ఫ్రీ యాక్సస్ పొందవచ్చు.
Jio vs Airtel Rs 2999 yearly Plan _ Check who offers better benefits
ఎయిర్‌టెల్ రూ. 2999 ప్లాన్ : ఎయిర్‌టెల్ 365 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలతో 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. అదనపు బెనిఫిట్స్ పొందాలంటే వినియోగదారులు అపోలో 24|7 సర్కిల్ బెనిఫిట్స్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ. 100 క్యాష్‌బ్యాక్, ఫ్రీ హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్‌కి ఫ్రీ సభ్యత్వాన్ని పొందవచ్చు. ఏ టెలికాం ఆపరేటర్ అదనపు బెనిఫిట్స్ అందిస్తున్నాయో పరిశీలిస్తే.. జియో, ఎయిర్‌టెల్ రెండూ సబ్‌స్క్రిప్షన్‌లలో సరసమైన ధరకే అందిస్తాయి.
అయినప్పటికీ, Jio ప్రత్యేక ఆఫర్‌తో మరింత రోజువారీ డేటా లిమిట్, వ్యాలిడిటీని అందిస్తోంది. ఎయిర్‌టెల్ యూజర్లు 2.5GB రోజువారీ డేటాను పొందాలనుకుంటే.. రూ. 3359 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలి. మరోవైపు, Jio రూ. 2879 ప్లాన్‌తో 2GB రోజువారీ డేటా లిమిట్ అందిస్తుంది. Airtel కన్నా జియో ప్లాన్ కొంచెం సరసమైనదిగా చెప్పవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..