రిలయన్స్ డేటా సంచలనం జియో బ్రాడ్ బ్యాండ్ సర్వీసు ప్రకటనతో ఇతర బ్రాడ్ బ్యాండ్ సర్వీసు పోటీదారులు కూడా తక్కువ ధరకే ఫైబర్ డేటా ప్లాన్లు ఆఫర్ చేస్తున్నాయి.
రిలయన్స్ డేటా సంచలనం జియో బ్రాడ్ బ్యాండ్ సర్వీసు ప్రకటనతో ఇతర బ్రాడ్ బ్యాండ్ సర్వీసు పోటీదారులు కూడా తక్కువ ధరకే ఫైబర్ డేటా ప్లాన్లు ఆఫర్ చేస్తున్నాయి. రిలయన్స్ జియో ఫైబర్ సర్వీసుకు పోటీగా ఎయిర్ టెల్, వోడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను కూడా చౌకైన ధరకే ఆఫర్ చేస్తున్నాయి. జియో ఫైబర్ సర్వీసు సెప్టెంబర్ 5, 2019 అధికారికంగా లాంచ్ కానుంది.
జియో లాంచింగ్ ముందే టెలికం ఆపరేటర్లు తమ ఎగ్జిస్టింగ్ ఫైబర్ డేటా ప్లాన్లను రివైజ్ చేసే పనిలో పడ్డాయి. రెవిన్యూపరంగా నష్టం వాటిల్లుతున్నప్పటికీ రోజురోజుకీ కస్టమర్లు తగ్గిపోతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో టెలికం కంపెనీలు తక్కువ ధరకే ఫైబర్ డేటా ప్లాన్లు అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఒక టెలికం కంపెనీలు మాత్రమే కాదు.. DTH సర్వీసులైన Tata Sky ఆపరేటర్ కూడా తమ కస్టమర్లకు ఈ వారమే అదనపు నెలలు ఉచితంగా సర్వీసు అందించనున్నట్టు ప్రకటించింది.
వార్షిక పేమెంట్ ప్లాన్ తీసుకున్న యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. కొన్ని నగరాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే ఈ DTH లేటెస్ట్ సర్వీసు ఆఫర్ అందుబాబులో ఉండనుంది. అన్ లిమిడెట్ డేటా ప్లాన్లు అదనపు వ్యాలిడెటీ కూడా అందిస్తోంది. ఫిక్సడ్ డేటా ప్లాన్లపై మాత్రం ఇతర నగరాల్లో అదనపు వ్యాలిడెటీ కూడా పొందవచ్చు. మరోవైపు BSNL కూడా వార్షిక బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను ప్రకటించింది. రూ.399 బండెల్ పై రూ.999 విలువైన అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది.
అంతకుముందు రూ.499 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ పై ఉచితంగా అమెజాన్ ప్రైమ్ సబ్ స్ర్కిప్షన్ అందించింది. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ రూ.399 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ అందిస్తోంది. అదేవిధంగా బిగ్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసు అందించే కంపెనీల్లో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా తమ వినియోగదారుల కోసం చౌకైన ధరకే బ్రాడ్ బ్యాండ్ ఫైబర్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. రూ. వెయ్యి లోపు బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ల వివరాలు, వ్యాలిడెటీ వివరాలేంటో ఓసారి చూద్దాం.
1. Airtel V-Fibre :
ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసు ఇండియాలో మొత్తం మూడు డేటా ప్లాన్లు అందిస్తోంది.
* ఎయిర్ టెల్ బేసిక్ ప్లాన్ రూ.799లతో 100GB డేటా అందిస్తోంది.
* అదనంగా 200GB డేటా వరకు ఆఫర్ చేస్తోంది. 6 నెలల కాల పరిమితి మాత్రమే
* Airtel 799 డేటా ప్లాన్ కింద 40Mbps స్పీడ్, అన్ లిమిటెడ్ లోకల్, STD కాల్స్
* ఎయిర్ టెల్ థ్యాంక్స్ బెనిఫెట్స్, ఎయిర్ టెల్ TV ప్రీమియం సబ్ స్ర్కిప్షన్ కూడా
* Airtel ఎంటర్ టైన్ మెంట్ ప్లాన్ రూ.1,099 పై అదనపు డేటా పొందవచ్చు
* రూ.1,599తో ఎయిర్ టెల్ ప్రీమియం ప్లాన్ యాక్సస్ చేసుకోవచ్చు.
2. జియో ఫైబర్ ప్లాన్లు :
* నెలకు రూ. 700 నుంచి రూ.10వేల వరకు డేటా ప్లాన్లు ఆఫర్ చేస్తోంది.
* రూ.700 నెల ప్యాకేజీపై ఫ్రీ వాయిస్ కాల్స్ లైఫ్ టైం వరకు ల్యాండ్ లైన్ నుంచి పొందవచ్చు.
* 100Mbps కనీసం బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ పొందవచ్చు.
3. వోడాఫోన్-ఐడియా డేటా ప్లాను :
* వోడాఫోన్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులో మల్టిపుల్ సబ్ స్ర్కిప్షన్ వ్యాలిడెటీ ఆప్షన్లతో అందిస్తోంది
* ఒక సర్కిల్ నుంచి మరో సర్కిల్ డేటా ప్లాన్లు వేర్వేరుగా ఉంటాయి.
* ముంబైలో రూ.814 డేటా ప్లాన్ ఆఫర్ పై 16Mbps స్పీడ్, అన్ లిమిటెడ్ డేటా ప్లాన్
* బెంగళూరులో మాత్రం 50Mbps, 60Mbps అన్ లిమిడెట్ డేటా ప్లాన్ ఆఫర్ చేస్తోంది.
* వోడాఫోన్ సొంత బ్రాడ్ బ్యాండ్ రూ.944 ప్లాన్ రీఛార్జ్‌పై 30రోజుల వ్యాలిడెటీ అందిస్తోంది.
* అన్ లిమిటెడ్ డేటాను 100Mbps స్పీడ్ తో పొందవచ్చు.
4. BSNL బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ :
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసును కూడా వెయ్యిలోపు రెండు డేటా ప్లాన్లు ఆఫర్ చేస్తోంది. రూ.1000 లోపు అందించే రెండు డేటా ప్లాన్లలో రూ.795 ప్లాన్ ఒకటి, రెండోవది రూ.900. ఈ రెండు డేటా ప్లాన్లపై 2Mbps స్పీడ్‌తో 8GBవరకు, 512Kbps స్పీడ్ అవతల 8GB వరకు అందిస్తోంది.