JioFiber Plans offering upto 1Gbps internet speed and bundle OTT subscriptions_ Full list of plans
JioFiber Plans : జియో యూజర్లకు అలర్ట్.. డేటా ప్లాన్లతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, OTT బెనిఫిట్స్ కోసం చూస్తున్నారా? రిలయన్స్ జియో (Reliance Jio) ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ఎంచుకోవాలా వద్దా అనే విషయంలో గందరగోళంగా ఉన్నారా? జియోఫైబర్ అందించే ఈ ప్లాన్‌లపై ఓసారి లుక్కేయండి.. బ్రాడ్‌బ్యాండ్ ఫైబర్ కనెక్షన్‌తో టెలికాం ఆపరేటర్ డౌన్‌లోడ్, అప్‌లోడ్ రెండింటికీ స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుంది. అదనంగా, జియోఫైబర్ యూజర్లు కాలింగ్, OTT బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. JioFiber ప్లాన్ల ద్వారా మొబైల్ ప్లాన్‌లను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు.
కేవలం ఫైబర్ కనెక్షన్‌ని మాత్రమే కొనుగోలు చేయండి. అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, ఇంట్లో లేదా ఆఫీసులో కూడా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. బోనస్‌గా, Jio ఫైబర్ కనెక్షన్ మొబైల్ ప్లాన్‌ల కన్నా వేగవంతమైనది. మీ సిటీ చేరుకునేందుకు 5వ జనరేషన్ కనెక్టివిటీ కోసం ఎదురుచూస్తున్నారా? మీ దగ్గరలోని 5G FOMO అందించదు.
రిలయన్స్ జియో ఇంటర్నెట్‌లో సర్ఫ్, స్ట్రీమింగ్ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, కాలింగ్, OTT బెనిఫిట్స్ అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలతో సహా వేగవంతమైన ఇంటర్నెట్, ఉచిత సబ్‌స్క్రిప్షన్ లేదా OTT ప్లాట్‌ఫారమ్‌లను అందించే ఎంపిక చేసిన JioFiber రీఛార్జ్ ప్లాన్‌లను వివరంగా పరిశీలిద్దాం.
OTT బెనిఫిట్స్‌తో JioFiber నెలవారీ ప్లాన్ :
JioFiber రూ. 999 ప్లాన్ : ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ డేటా వినియోగంతో 150Mbps ఇంటర్నెట్ డేటా వేగాన్ని అందిస్తుంది. అదనంగా, జియో యూజర్లు Amazon Prime Video, Disney+ Hotstar, Voot Select, Sony Liv, Zee5, మరో 10 OTT ఛానెల్‌లతో సహా OTT యాప్‌లకు ఫ్రీ వాయిస్ కాలింగ్, ఫ్రీగా మెంబర్‌షిప్ పొందవచ్చు.
JioFiber రూ. 1499 ప్లాన్ : ఈ ప్లాన్ కింద జియో యూజర్లు 300 Mbps వేగంతో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ పొందవచ్చు. OTT బండిల్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, మరో 14 OTT ఛానెల్‌లకు ఫ్రీగా మెంబర్‌షిప్ పొందవచ్చు.
JioFiber Plans offering upto 1Gbps internet speed and bundle OTT subscriptions
JioFiber రూ. 2499 ప్లాన్ : ఇంటర్నెట్ యూజర్లు గరిష్టంగా 500Mbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను Netflix, Amazon Prime, Disney+ Hotstar ఉచిత సబ్‌స్క్రిప్షన్, మరో 14 OTT ఛానెల్‌లకు ఫ్రీ మెంబర్‌షిప్ పొందవచ్చు.
JioFiber రూ. 3999 ప్లాన్ : ఈ ప్లాన్ స్ట్రీమర్‌లు, గేమర్లు లేదా వాణిజ్యపరమైన ఉపయోగం కోసం తగినంత అన్‌లిమిటెడ్ 1Gbpsని అందిస్తుంది. బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో యూజర్లు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, మరో 15 OTT ఛానెల్‌లకు ఫ్రీగా మెంబర్‌షిప్ కూడా పొందవచ్చు.
JioFiber రూ. 8499 ప్లాన్ : ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లిస్టులో అత్యంత ఖరీదైన ప్లాన్. నెలవారీ వ్యాలిడిటీతో JioFiber యూజర్లు 30 రోజుల పాటు 1Gbps స్పీడ్‌తో 6600GB డేటాను పొందుతారు. ఫ్రీగా OTT బండిల్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, మరో 15 OTT ఛానెల్‌లకు ఉచితంగా యాక్సెస్ అందిస్తుంది.
అదే సమయంలో, Jio పోటీదారులైన Airtel కూడా OTT బెనిఫిట్స్‌తో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తుంది. రూ. 999, రూ. 1,498, రూ. 3,999 ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు 1Gbps స్పీడ్ వరకు ఆఫర్ చేస్తాయి. Amazon Prime వీడియోలకు ఫ్రీగా OTT సభ్యత్వం, Netflix, Disney Plus Hotstar అదనంగా, యూజర్లు Airtel Xtream ప్రీమియం బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..