JioPhone Next : జియో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ నుంచి చౌకైన జియో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది. జూన్ 24 (గురువారం) జరిగిన రిలయన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో ఈ కొత్త 5G స్మార్ట్ ఫోన్ ను రిలయన్స్ లాంచ్ చేసింది.

JioPhone Next smartphone : ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ నుంచి చౌకైన జియో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది. జూన్ 24 (గురువారం) జరిగిన రిలయన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో ఈ కొత్త 5G స్మార్ట్ ఫోన్ ను రిలయన్స్ లాంచ్ చేసింది. కోవిడ్ నేపథ్యంలో గతేడాది మాదిరిగానే ఈసారి కూడా డిజిటల్ మోడ్‌లోనే ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో RIL చైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. గూగుల్, జియో సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘JIO PHONE NEXT 5G’ ఫోన్‌ను సెప్టెంబర్ 10న అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. తమ కంపెనీలో గూగుల్ 7.7 శాతం వాటాను 33,737 కోట్లతో పెట్టుబడి పెట్టినట్టు వెల్లడించారు.

ప్రస్తుత జియో 4G స్మార్ట్ ఫోన్ల కంటే సరికొత్త ఫీచర్లతో జియో 5G ఫోన్ యూజర్లను ఆకట్టుకోనుంది. ప్రస్తుత 5G స్మార్ట్ ఫోన్ల కంటే ఈ కొత్త జియో స్మార్ట్ ఫోన్ చాలా సరసమైన ధరకే అందుబాటులో రానుంది. దీని ధర మార్కెట్లో రూ.5వేల లోపే ఉండొచ్చునని అంచనా. 4G స్మార్ట్ ఫోన్ల కంటే కూడా రేటు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. జియో ఫోన్ నెక్స్ట్ పూర్తిగా గూగుల్, జియో రెండింటికి సూట్ యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది. జియో Phone Next.. ఆండ్రాయిడ్, మోస్ట్ ఆప్టిమైజ్డ్ సామర్థ్యంతో పనిచేస్తుంది.

ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్, ముఖ్యంగా భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ కోసం డెవలప్ చేసింది. ఇందులో వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్స్ట్ , ఆటోమేటిక్ రీడ్, ట్రాన్స్‌లేషన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫిల్టర్‌లతో స్మార్ట్ కెమెరా ఫీచర్స్ యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. కొత్త జియో 5G స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయంటే.. మినిమం స్పెషిఫికేషన్లతో జియో 5G స్మార్ట్ ఫోన్ ఉందని తెలుస్తోంది. యూజర్లకు ఎంతో సౌకర్యవంతమైన ఎక్స్ పీరియన్స్ అందించనుంది. ఆండ్రాయిడ్ ఆధారిత కస్టమజైడ్ సాఫ్ట్ వేర్‌ను గూగుల్ అందిస్తోంది. ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లలో ఉండే ఆండ్రాయిడ్ వన్ వెర్షన్ ఆధారంగా పనిచేయనుంది.

ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ JioOSపేరుతో రానుంది. రిలయన్స్ జియో బుక్ ల్యాప్ టాప్ లో LTE కనెక్టవిటీ ఫీచర్ తో పాటు క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 665 పవర్ తో పనిచేయనుంది. గూగుల్ స్పెషల్ ఆండ్రాయిడ్ 10 వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుంది. ఇప్పటివరకు ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత తక్కువ ధర కలిగిన స్మార్ట్‌ఫోన్‌గా జియో 5G స్మార్ట్ ఫోన్ నిలవనుంది. మరోవైపు.. AGM ఈవెంట్లో రిలయన్స్.. సరసమైన ధరకే కొత్త ల్యాప్ టాప్ Jio Book కూడా తీసుకొస్తోంది.

ట్రెండింగ్ వార్తలు