Jio Prepaid Plan Offers : జియో ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్లు.. అన్‌లిమిటెడ్ 5G డేటా ప్లాన్లు మీకోసం.. ఏ ప్లాన్ బెటర్ అంటే?

Jio Prepaid Plan Offers : రిలయన్స్ జియో రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్/రోజు, 25జీబీ డేటా ఉన్నాయి. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను పొందవచ్చు.

Jio's Rs 296 prepaid plan offers ( Image Source : Google )

Jio Prepaid Plan Offers : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. మీరు జియో ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్లు అయితే.. రోజువారీ డేటా లిమిట్ లేని డేటా ప్లాన్లను పొందవచ్చు. మీకోసం జియో అద్భుతమైన డేటా ప్లాన్లను తీసుకొచ్చింది. అందులో జియో నుంచి రూ. 296 ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు. డేటా బెనిఫిట్స్‌తో పాటు ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ 5జీ డేటాను కూడా అందిస్తుంది. మీకోసం అన్ని డేటాప్లాన్ వివరాలు అందుబాటులో ఉన్నాయి.

Read Also : Apple Days Sale : విజయ్ సేల్స్‌లో ఆపిల్ డేస్ సేల్.. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ సిరీస్‌పై టాప్ డీల్స్.. ఏ ఐఫోన్ ధర ఎంతంటే?

జియో రూ. 296 ప్రీపెయిడ్ ప్లాన్ :
రిలయన్స్ జియో రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్/రోజు, 25జీబీ డేటా ఉన్నాయి. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను పొందవచ్చు. జియో వెల్‌కమ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. అదనపు బెనిఫిట్స్ కింద జియోసినిమా, జియోటీవీ, జియోక్లౌడ్ యాక్సెస్ చేయొచ్చు. మీరు 5జీ లేదా 4జీ డేటాను ఉపయోగిస్తే.. మీ డేటా స్పీడ్ 64Kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్ సర్వీస్ వాలిడిటీ వ్యవధి 30 రోజులు ఉంటుంది.

జియో రూ. 15 నుంచి డేటా వోచర్‌లను కూడా అందిస్తుంది. FUP (ఫెయిర్ యూసేజ్ పాలసీ) పరిమితి ముగిసిన తర్వాత అదనంగా 1జీబీ డేటాను అందిస్తుంది. జియో రూ. 296 ప్లాన్ ద్వారా వినియోగదారులకు రోజుకు సుమారు రూ. 10 ఖర్చవుతుంది. ఒక నెల పాటు మొత్తంలో డేటాతో వినియోగించేందుకు ఇదే బెస్ట్ ఆప్షన్. అయితే, మీరు రోజువారీ డేటా ప్లాన్‌లను ఎంచుకుంటే.. మీరు మరింత తక్కువ ధరలను పొందవచ్చు. అయినప్పటికీ, ఈ ప్లాన్‌లు రూ. 296 ప్లాన్ ఒక రోజులో 10జీబీ లేదా 15జీబీ వినియోగించుకోవచ్చు.

బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులకు హోమ్ డెలివరీ సర్వీసు :
ఇంతలో, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులకు హోమ్ డెలివరీ సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీసు ప్రస్తుతం గురుగ్రామ్, ఘజియాబాద్‌లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త సర్వీసు ప్రీపెయిడ్ కనెక్షన్‌లను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

బీఎస్ఎన్ఎల్ సిమ్ ఆర్డర్ కింద అధికారిక బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌లోని ప్రత్యేక వెబ్‌పేజీ ద్వారా కస్టమర్‌లు సులభంగా సిమ్ కార్డ్‌ను ఆర్డర్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఈ కొత్త సర్వీసును అందించడానికి బీఎస్ఎన్ఎల్ టెలికాం సొల్యూషన్స్‌లో ప్రత్యేకత కలిగిన ప్రూనే అనే కంపెనీతో అధికారికంగా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో ఇప్పటికే సిమ్ కార్డ్‌ల హోమ్ డెలివరీని అందిస్తున్న ప్రైవేట్ టెలికాం ఆపరేటర్‌లతో పోటీపడే టెలికం దిగ్గజాల్లో బీఎస్ఎన్ఎల్‌ కూడా ఉంది.

Read Also : Apple WWDC 2024 : ఆపిల్ WWDC ఈవెంట్‌.. కొత్త ఏఐ సిస్టమ్‌ ఆపిల్ ఇంటెలిజెన్స్.. అసలు ఇదేంటి? ఎలా పనిచేస్తుందంటే?