Lava Agni 4 Launch
Lava Agni 4 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి లావా కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అగ్ని 4 వచ్చేసింది. ఇందులో అమోల్డ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్, 5000mAh బ్యాటరీ ఉన్నాయి. ఇంకా, లావా అగ్ని ఫోన్ ఏఐ ఫీచర్లతో వస్తుంది. ఇంకా, ఈ లావా ఫోన్ అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్ కలిగి ఉంది. లావా అగ్ని 4 ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌లను ఓసారి పరిశీలిద్దాం..
లావా అగ్ని 4 ధర ఎంతంటే? :
లావా అగ్ని 4 ఫోన్ సింగిల్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ (Lava Agni 4 Launch) ప్రారంభ ధర రూ. 22,999కు పొందవచ్చు. డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఆఫర్లతో మరింత తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ ఫాంటమ్ బ్లాక్, లూనార్ మిస్ట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ లావా అగ్ని 4 ఫోన్ నవంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో అమ్మకానికి రానుంది.
లావా అగ్ని 4 6.67-అంగుళాల ఫ్లాట్ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2,400 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్, 446 PPI (పిక్సెల్స్ పర్ ఇంచ్) పిక్సెల్ డెన్సిటీతో కలిగి ఉంది. ఈ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ 15తో రన్ అవుతుంది. ఈ ఫోన్ కంపెనీ 3 ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది. అదనంగా, ఈ ఫోన్ 66W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఈ ఫోన్ ఫ్రంట్ సైడ్ 1.7mm ఈక్విలేటరల్ బెజెల్స్‌తో అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్ బ్యాక్ సైడ్ మ్యాట్ AG గ్లాస్ కలిగి ఉంది.
Read Also : Google Pixel 10 : ఆఫర్ అదిరింది బ్రో.. గూగుల్ పిక్సెల్ 10 ధర భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
అంతేకాకుండా, మెరుగైన డ్రాప్ ప్రొటెక్షన్ కోసం సూపర్ యాంటీ-డ్రాప్ డైమండ్ ఫ్రేమ్ స్క్రీన్‌పై కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 8GB LPDDR5X ర్యామ్, 256GB UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది.
కంపెనీ 1.4 మిలియన్లకు పైగా AnTuTu (v10) స్కోర్‌ను క్లెయిమ్ చేస్తుంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఈ లావా ఫోన్ 4,300 చదరపు మిమీ హీట్ వెదజల్లే ప్రాంతంతో వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కలిగి ఉంది. ఎంతగా వాడినా కూడా లావా అగ్ని 4 ఫోన్ కూలింగ్ అందిస్తుంది.
కెమెరా ఫీచర్లు :
కెమెరాల విషయానికొస్తే.. లావా అగ్ని 4 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో OISతో కూడిన 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈఐఎస్ సపోర్టుతో 50MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. డ్యూయల్ వ్యూ వీడియో, డాక్యుమెంట్ కరెక్షన్ మోడ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు రెండూ 4K 60fps వద్ద వీడియోను రికార్డ్ చేయగలవు.
లావా అగ్ని 4 ఏఐ ఫీచర్లు :
ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. లావా అగ్ని 4లో IR బ్లాస్టర్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో వాయు ఏఐ (Vayu AI) కూడా ఉంది. ఈ టూల్ ఏఐ అసిస్టెంట్‌గా రన్ అవుతుంది. ఈ ఫోన్ ఏఐ ఫొటో ఎడిటర్, ఏఐ ఇమేజ్ జనరేటర్, ట్రాన్సులేషన్, ఏఐ కరెక్షన్, ఏఐ వాయిస్ అసిస్టెంట్, ఏఐ మ్యాజిక్ ఫ్లోటింగ్ బాల్ వంటి అనేక ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి.