Lava Blaze Dragon 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? అతి చౌకైన ధరకే లావా బ్లేజ్ డ్రాగన్ 5G ఫోన్ వచ్చేసింది.. ఆగస్టు 1 నుంచే సేల్..!

Lava Blaze Dragon 5G : భారత మార్కెట్లో అద్భుతమైన ఫీచర్లతో లావా బ్లేజ్ డ్రాగన్ 5G ఫోన్ లాంచ్ అయింది. ఆగస్టు 1 నుంచి సేల్ ప్రారంభం కానుంది.

Lava Blaze Dragon 5G

Lava Blaze Dragon 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. స్వదేశీ స్మార్ట్‌ఫోన్ లావా నుంచి కొత్త 5G స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. రూ.10వేల సెగ్మెంట్‌లో బ్లేజ్ డ్రాగన్ 5G ఫోన్ (Lava Blaze Dragon 5G) లాంచ్ అయింది. ఈ బడ్జెట్ ఫోన్ నెక్స్ట్ జనరేషన్ కనెక్టివిటీతో క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ కలిగి ఉంది.

4nm ప్రాసెస్‌పై స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌ కలిగి ఉంది. లావా ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే. భారీ బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ లావా ఫోన్ ఆగస్టు 1 నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. లావా బ్లేజ్ డ్రాగన్ 5G ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

లావా బ్లేజ్ డ్రాగన్ 5G స్పెసిఫికేషన్లు :
లావా బ్లేజ్ డ్రాగన్ 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.74-అంగుళాల HD+ LCD ప్యానెల్‌ పొందుతుంది. హుడ్ కింద ఈ లావా ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 SoC చిప్‌సెట్‌ కలిగి ఉంది. 4GB LPDDR4x ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ లావా ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది.

Read Also : Realme 15 5G Series : కొత్త రియల్‌మి 15 5G సిరీస్ వచ్చేసిందోచ్.. 2 ఫోన్లలో AI కెమెరా ఫీచర్లు హైలెట్.. ధర కూడా మీ బడ్జెట్‌లోనే..!

18W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్‌లో రన్ అవుతుంది. మెయిన్ అప్‌డేట్, 2 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లు పొందవచ్చు. ఫొటోల విషయానికి వస్తే.. 50MP కెమెరాతో వస్తుంది. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా 5G, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-C సపోర్టు అందిస్తుంది.

భారత్‌లో లావా బ్లేజ్ డ్రాగన్ 5G ధర ఎంతంటే? :
లావా బ్లేజ్ డ్రాగన్ 5G ఫోన్ 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999 నుంచి ఉంటుంది. ఆసక్తిగల కస్టమర్లు రూ.వెయ్యి బ్యాంక్ డిస్కౌంట్, రూ.వెయ్యి ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. దాంతో అసలు ధర నుంచి లావా 5G ఫోన్ రూ.8,999కి తగ్గుతుంది. గోల్డెన్ మిస్ట్, మిడ్‌నైట్ మిస్ట్ కలర్ ఆప్షన్లలో కూడా లావా ఫోన్ ఎంచుకోవచ్చు.