Lava Bold N1 Launch : లావా బోల్డ్ N1 సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు..
Lava Bold N1 Launch : లావా బోల్డ్ N1 సిరీస్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ధర, ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలపై ఓసారి లుక్కేయండి.

Lava Bold N1 Launch
Lava Bold N1 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో లావా కొత్త బోల్డ్ సిరీస్ కింద 2 కొత్త ఎంట్రీ-లెవల్ ఫోన్‌లను ప్రవేశపెట్టింది. లావా బోల్డ్ N1, లావా బోల్డ్ N1 ప్రో (Lava Bold N1 Launch) మోడళ్లను లాంచ్ చేసింది.
ఈ 2 ఫోన్ల ధర రూ. 7వేలు లోపు, బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ల కోసం చూస్తున్న వారికి బెస్ట్ ఫోన్లు అని చెప్పొచ్చు. ఈ లావా ఫోన్ UNISOC ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. IP54 ప్రొటెక్షన్ అందిస్తుంది. లావా బోల్డ్ N1, బోల్డ్ N1 ప్రో ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
లావా బోల్డ్ N1 ప్రో స్పెసిఫికేషన్లు :
లావా బోల్డ్ N1 ప్రో ఫోన్ (Lava Bold N1 Launch) 6.67-అంగుళాల HD+ ప్యానెల్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. UNISOC T606 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 4GB LPDDR4X ర్యామ్, 128GB స్టోరేజ్‌తో వస్తుంది.
ఈ లావా ఫోన్ 18W ఛార్జింగ్‌తో కూడిన భారీ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ ఆప్షన్ కూడా అందిస్తుంది. ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఈ లావా ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.
లావా బోల్డ్ N1 స్పెసిఫికేషన్లు :
లావా బోల్డ్ N1 ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.75-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను అందిస్తుంది. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్‌తో అదే UNISOC ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను కూడా అందిస్తుంది.
5,000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది. బాక్స్ వెలుపల ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. కెమెరా విషయానికొస్తే.. ఈ లావా ఫోన్ 13MP బ్యాక్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది.
వేరియంట్లు, ధర ఎంతంటే? :
లావా బోల్డ్ N1 ఫోన్ మోడల్ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ ఉండగా, లావా బోల్డ్ N1 ధర రూ.5,999కు లభ్యమవుతుంది. రేడియంట్ బ్లాక్, స్పార్కింగ్ ఐవరీ కలర్ లభిస్తుంది.
జూన్ 4 నుంచి ఈ ఫోన్ అమ్మకానికి రానుంది. మరోవైపు, 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ లావా బోల్డ్ N1 ప్రో ధర భారతీయ మార్కెట్లో రూ.6,799కు అందుబాటులో ఉంటుంది.
Read Also : Nothing Phone 2 : ఆఫర్ అదుర్స్.. అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 2 ధర భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ డోంట్ మిస్..!
టైటానియం గోల్డ్, స్టీల్త్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. జూన్ 2 నుంచి అమెజాన్‌లో ఈ ప్రో వేరియంట్ అమ్మకానికి రానుంది. ఈ రెండు ఫోన్ల కొనుగోలుపై వినియోగదారులు కూపన్ ద్వారా రూ.100 డిస్కౌంట్ పొందవచ్చు.