Lava Bold N4 Pro 5G : ఇది కదా ఫోన్.. కొత్త లావా బోల్డ్ N4 ప్రో 5G వస్తోంది.. లాంచ్ డేట్ ఇదే.. ఫీచర్లు మాత్రం కిర్రాక్..!

Lava Bold N4 Pro 5G : లావా బోల్డ్ N4 ప్రో 5జీ సెప్టెంబర్ 18న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గోల్డ్, బ్లూ కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది. లావా బోల్డ్ N4 ప్రో 5జీ అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంటుంది.

  • Published on- September 11, 2026 / 07:57 PM IST

Lava Bold N4 Pro 5G

  • లావా బోల్డ్ N4 ప్రో 5జీ సెప్టెంబర్ 18న లాంచ్ కానుంది
  • ఈ స్మార్ట్‌ఫోన్ గోల్డ్, బ్లూ కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది
  • గత నెలలో లావా బోల్డ్ N4 లైట్ ఫోన్ లాంచ్ అయింది

Lava Bold N4 Pro 5G : కొత్త లావా ఫోన్ కోసం చూస్తున్నారా? వచ్చే వారం భారత మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ చేయనుంది. లావా బోల్డ్ N4 ప్రో 5జీ కీలక స్పెసిఫికేషన్లను కంపెనీ వెల్లడించింది.ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుంది.

లావా బోల్డ్ N4 ప్రో 5జీలో 6,000mAh బ్యాటరీ కూడా ఉంటుంది. లావా బోల్డ్ N4 లైట్‌ను గత నెలలో దేశీయ మార్కెట్లో లాంచ్ అయింది. ఇప్పుడు ప్రో 5జీ వెర్షన్ లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. ఈ ఫోన్ పూర్తి ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఈ నెల 18నే ప్రో 5జీ లాంచ్ :
రాబోయే స్మార్ట్‌ఫోన్ కోసం అమెజాన్ మైక్రోసైట్ క్రియేట్ చేసింది. లావా బోల్డ్ N4 ప్రో 5జీ సెప్టెంబర్ 18న లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గోల్డ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది. లావా బోల్డ్ N4 ప్రో 5Gలో 6,000mAh బ్యాటరీ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుంది.

Read Also : Motorola Edge 70 Fusion : వారెవ్వా.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఈ మోటోరోలా ఫోన్ చాలా చీప్ గురూ.. ఇదే బెస్ట్ టైమ్..!

లావా బోల్డ్ N4 ప్రో 5జీ ఫ్లాట్ రియర్ ప్యానెల్‌తో వస్తుంది. టాప్ రైట్ కార్నర్ రెక్టాంగులర్ కెమెరా ఐలాండ్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా మాడ్యూల్‌లో LED ఫ్లాష్‌తో సహా 4 కటౌట్‌లు ఉన్నాయి. ఫ్లాట్ మిడ్-ఫ్రేమ్‌తో వస్తుంది. పవర్ బటన్ వాల్యూమ్ కంట్రోల్స్ స్మార్ట్‌ఫోన్ రైట్ సైడ్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా కోసం వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్, డిస్‌ప్లే ధరల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

లావా బోల్డ్ N4 లైట్ అదుర్స్ :

గత నెల చివరిలో భారత మార్కెట్లో లావా బోల్డ్ N4 లైట్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 8,099 మాత్రమే. లావా బోల్డ్ N4 లైట్‌లో 6.56-అంగుళాల ఎల్సీడీ టచ్‌స్క్రీన్ ఉంది. UNISOC 9863A ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. లావా బోల్డ్ N4 లైట్‌లో 3GB ర్యామ్, 32GB స్టోరేజ్ ఉన్నాయి. మైక్రో SD కార్డ్ ద్వారా 64GB వరకు విస్తరించవచ్చు.

ఆండ్రాయిడ్ 16 గోతో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8MP రియర్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. లావా బోల్డ్ N4 లైట్‌లో 10W ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,000mAh బ్యాటరీ ఉంది. సేఫ్టీ కోసం ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు రెండు ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు వస్తాయి.