Twitter India MD : ట్విట్టర్ ఇండియా ఎండీకి లీగల్ నోటీసు..

ట్విట్టర్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ట్విట్టర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (MD Manish Maheshwari) మనీశ్‌ మహ్వేశ్వరికి యూపీ పోలీసులు లీగల్‌ నోటీసు పంపారు. వారం రోజుల్లోగా లోనీ బోర్డర్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.

Ghaziabad Police Send Legal Notice To Twitter India Md

Ghaziabad police send legal notice : ట్విట్టర్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ట్విట్టర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (MD Manish Maheshwari) మనీశ్‌ మహ్వేశ్వరికి యూపీలోని ఘజియాబాద్‌ పోలీసులు లీగల్‌ నోటీసు పంపారు. వారం రోజుల్లోగా లోనీ బోర్డర్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.

యూపీలో ఘజియాబాద్‌లో ముస్లిం వ్యక్తిపై జరిగిన దాడికి సంబంధించి ‘మతపరమైన అశాంతిని రెచ్చగొట్టినందుకు’ యూపీ పోలీసు నోటీసులు జారీ చేశారు. ఈ సంఘటనలో మతపరమైంది ఏమీ లేదని యూపీ పోలీసులు చెబుతున్నారు.


నకిలీ యంత్రాలు విక్రయించారనే ఆగ్రహంతో సదరు వ్యక్తిపై దాడి చేశారని తెలిపారు. అయితే, దాడికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. గతంలో ఢిల్లీ స్పెషల్‌ పోలీసుల బృందం ‘కాంగ్రెస్‌ టూల్‌కిట్‌’ వ్యవహారంలో కూడా ట్విట్టర్ ఇండియా ఎండీని మనీశ్‌ మహేశ్వరిని ప్రశ్నించింది.