Jio Recharge Plans : రూ.500 లోపు జియో రీఛార్జ్ ప్లాన్లు.. మీ బడ్జెట్‌కు బెస్ట్ ఆప్షన్స్ ఇవే! ఫుల్ లిస్ట్ ఇదిగో..

Jio Recharge Plans : జియో రీఛార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్ ధరలోనే లభించే అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు రెడీగా ఉన్నాయి. రూ. 500 లోపు ధరలో మీకు ఏ ప్లాన్ కావాలో డిసైడ్ చేసుకోండి..

  • Published on- September 29, 2026 / 07:24 PM IST

Jio Recharge Plans

  • జియోలో రూ. 500 లోపు అనేక డేటా-ఓన్లీ ప్లాన్‌లు
  • ప్లాన్‌లు 5G, కాల్స్, SMS, ఓటీటీ బెనిఫిట్స్ పొందొచ్చు
  • కొన్ని ప్లాన్‌లతో అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తాయి

Jio Recharge Plans : జియో యూజర్ల కోసం అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లు.. మీకు డేటా మాత్రమే కావాలా? కేవలం ఫోన్ కాల్స్, SMS బెనిఫిట్స్ ప్లాన్లు కావాలా? మీకోసం అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు రెడీగా ఉన్నాయి. జియో డేటా ఓన్లీ ప్లాన్‌లను కూడా అందిస్తోంది.

అన్ లిమిటెడ్ 5జీ, కాలింగ్, SMS ప్లాన్‌లను కూడా ఆఫర్ చేస్తోంది. రీఛార్జ్ ప్లాన్‌లతో అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. మీరు రూ. 500 లోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ (Jio Recharge Plans) కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. జియో డేటా ఓన్లీ ప్లాన్ల నుంచి ఓటీటీ, వాయిస్ కాల్స్ బెనిఫిట్స్ అందించే ప్లాన్లపై ఓసారి లుక్కేయండి..

జియో డేటా-ఓన్లీ ప్లాన్లు :
రూ. 103 ప్లాన్ :
జియో రూ. 103 రీఛార్జ్ మొబైల్ డేటా యూజర్లకు మాత్రమే. 28 రోజుల వ్యాలిడిటీతో 5GB ఫిక్స్‌డ్ డేటా అందిస్తుంది. వాయిస్ కాలింగ్, SMS బెనిఫిట్స్ రావు. ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌ కూడా పొందొచ్చు. జియోహాట్‌స్టార్, సోనీలివ్, జీ5తో హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్, జియోహాట్‌స్టార్, ఫ్యాన్‌కోడ్, లయన్స్‌గేట్, డిస్కవరీప్లస్, ఇంటర్నేషనల్ ప్యాక్ ఉన్నాయి. జియోహాట్‌స్టార్, సన్‌ఎన్‌ఎక్స్‌టీ, కంచ లంక, హోయిచోయ్‌ వంటి రీజనల్ ప్యాక్‌ను కూడా ఎంచుకోవచ్చు.

రూ. 149 ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ, 10GB ఫిక్స్‌డ్ డేటా అందిస్తుంది. ఫోన్ కాలింగ్, SMS బెనిఫిట్స్ ఉండవు. 90 రోజుల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది.

రూ. 200 ప్లాన్ :
ఇందులో డేటాతో పాటు ఓటీటీ బెనిఫిట్స్ పొందొచ్చు. యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్, జియోహాట్‌స్టార్ మొబైల్, హాలీవుడ్, కుకు టీవీ వంటి 15 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ అందిస్తుంది. జియోటీవీకి కూడా యాక్సెస్ పొందొచ్చు.

Read Also : Vivo X300 Pro Sale : కొంటే వివో ఫోన్ కొనాలి.. ఈ వివో X300 ప్రోపై రూ. 10వేలకు పైగా తగ్గింపు.. ఎలాగంటే?

మూవీల కోసం సినీపోలిస్‌పై రూ. 150 తగ్గింపు పొందవచ్చు. వ్యాలిడిటీ కోసం 30GB ఫిక్స్‌డ్ డేటా, అన్ లిమిటెడ్ 5జీ డేటా కూడా పొందొచ్చు. జియోఏఐక్లౌడ్‌కు యాక్సెస్ లభిస్తుంది. రూ. 200 రీఛార్జ్‌లో కూడా వాయిస్ కాలింగ్, SMS బెనిఫిట్స్ ఉండవు.

రూ. 500 లోపు జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లివే :
రూ. 349 ప్లాన్
జియో రూ. 349 రీఛార్జ్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్ లిమిటెడ్ 5G డేటా, రోజుకు 2GB డేటాను అందిస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS కూడా అందిస్తుంది. కాలింగ్, డేటాతో పాటు సబ్‌స్క్రైబర్‌లకు రూ. 35,100 విలువైన 18 నెలల గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్‌, 5TB క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో నానో బనానా, జెమిని లైవ్ కూడా ఉంది. 12 నెలల పాటు కాన్వా ప్రో లైట్, జియోహాట్‌స్టార్ మొబైల్, జియోటీవీ, జియోఏఐక్లౌడ్‌లను కూడా అందిస్తోంది.

రూ. 399 ప్లాన్ :
జియో రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్‌లో 28 రోజుల అన్ లిమిటెడ్ 5జీ డేటాతో పాటు రోజుకు 2.5GB డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS పొందొచ్చు. నానో బనానా, జెమిని లైవ్‌తో పాటు 18 నెలల గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్, 5TB క్లౌడ్ స్టోరేజ్‌ పొందవచ్చు. 12 నెలల కాన్వా ప్రో లైట్, జియోహాట్‌స్టార్ మొబైల్ ప్లస్, హాలీవుడ్, జియోగేమ్స్ పాస్, ఫ్యాన్‌కోడ్, జియోటీవీని పొందొచ్చు.

రూ. 459 రీఛార్జ్ ప్లాన్ :
ఈ రీఛార్జ్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2GB డేటాతో అన్ లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS అందిస్తుంది. అదనంగా 5GB 4జీ డేటా కూడా పొందొచ్చు.

అలాగే, 12 నెలల కాన్వా ప్రో లైట్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. 18 నెలల గూగుల్ జెమిని ప్రో, 5TB క్లౌడ్ స్టోరేజ్, నానో బనానా కూడా లభిస్తుంది. జియోహాట్‌స్టార్ మొబైల్, జియోటీవీ, జియోఏఐక్లౌడ్‌తో పాటు జియోగేమ్స్ పాస్, ఫ్యాన్‌కోడ్, స్నాప్‌చాట్ ప్లస్ కూడా పొందొచ్చు.