MacBook Air M3 Price Drop
MacBook Air M3 Price Drop : కొత్త ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M3 ప్రస్తుతం అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఇ-కామర్స్ దిగ్గజాలు ప్రస్తుత 8జీబీ ర్యామ్ మోడల్ స్టాక్‌ను క్లియర్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఆపిల్ కొత్త వెర్షన్‌ల కోసం 16జీబీని స్టాండర్డ్‌గా మార్చింది. విజయ్ సేల్స్ ఈ మోడల్‌ను రూ. 94,499కి అందిస్తోంది. ఈ ల్యాప్‌టాప్ అసలు ప్రారంభ ధర రూ. 1,14,900 నుంచి తగ్గింది. మీరు రూ. 20,401 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.
అదనంగా, ఐసీఐసీఐ, ఎస్బీఐ వంటి ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5వేలు అదనపు తగ్గింపు, ఈఎంఐ లావాదేవీలపై వర్తిస్తుంది. ధరను మరింత తగ్గిస్తుంది. ఈ ఆఫర్ మిడ్‌నైట్ కలర్ వేరియంట్‌కి వర్తిస్తుంది. రిలయన్స్ డిజిటల్ కూడా అదే మోడల్‌ను రూ. 98,606కి విక్రయిస్తోంది. విజయ్ సేల్స్ కన్నా కొంచెం ఎక్కువ అయినప్పటికీ అసలు ధర కన్నా తక్కువగానే ఉంటుంది.
మ్యాక్‌బుక్ ఎయిర్ M2 కూడా డిస్కౌంట్ పొందినప్పటికీ, M3 మోడల్ బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా మ్యాక్‌బుక్ ఎయిర్ M1 నుంచి అప్‌గ్రేడ్ అయ్యే వారికి సరైనది. మ్యాక్‌బుక్స్ దీర్ఘకాల స్థిరత్వం, అద్భుతమైన బ్యాటరీని కలిగి ఉంటాయి. ఎయిర్ మోడల్‌లు ఆకర్షణీయమైన ఫొటో ఎడిటింగ్ సామర్థ్యాలు, సాధారణ పర్ఫార్మెన్స్, ఆకర్షణీయమైన ప్రదర్శన, బ్యాటరీ లైఫ్, స్లిమ్, తేలికైన డిజైన్‌ను అందిస్తాయి. ఈ బెనిఫిట్స్ ఎయిర్ M3కి కూడా విస్తరిస్తాయి. ప్రాథమిక 4కె వీడియో ఎడిటింగ్‌ను నిర్వహించగలదు. దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్టును అందిస్తుంది.
M1తో పోలిస్తే.. M3 చిప్‌తో 2024 మ్యాక్‌బుక్ ఎయిర్ స్పీడ్ ప్రాసెసింగ్, మెరుగైన మల్టీ టాస్కింగ్, మెషీన్ లెర్నింగ్ సామర్థ్యాలను అందిస్తుంది. గరిష్టంగా 18 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. తరచూ ఛార్జింగ్ అవసరం లేకుండా దాదాపు ఒక రోజు వరకు ల్యాప్‌టాప్ అవసరమయ్యే నిపుణులు, విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్.
మ్యాక్ ఎయిర్ M3 మోడల్ ప్రత్యేక ఫీచర్లలో ఒకటి. డ్యూయల్ ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లేలకు సపోర్టు అందిస్తుంది. మల్టీ టాస్కర్లకు స్పెషల్ ఫీచర్ అని చెప్పవచ్చు. అయితే, ఈ ఫంక్షన్‌కు ల్యాప్‌టాప్ క్లోజ్ చేయడం అవసరం. మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్3 ఆపిల్ సిగ్నేచర్ తేలికైనది అలాగే ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. పర్ఫార్మెన్స్ పరంగా మోస్ట్ పోర్టబుల్‌గా అని చెప్పవచ్చు.
మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్3 గరిష్టంగా 24జీబీ ర్యామ్, వై-ఫై 6ఈకి సపోర్టుతో వస్తుంది. దీర్ఘకాలిక వినియోగానికి బెస్ట్ అని చెప్పవచ్చు. కనీసం 6 ఏళ్ల పాటు అద్భుతమైన పనితీరు, సాఫ్ట్‌వేర్ సపోర్టును అందిస్తుంది.
Read Also : Redmi Note 14 5G Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? రెడ్‌మి నోట్ 14 5జీ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ధర, ఆఫర్లు!