Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. పెరిగిన బైక్‌ల ధరలు
వాహన తయారీ కంపెనీలు తన వాహన శ్రేణిలోని పలు మోడళ్ల ధరలను పెంచేస్తున్నాయి. రవాణా చార్జీలు, ముడిపదార్ధాల ధర పెరిగిపోవడంతో వాహన తయారీ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా మారుతి సుజుకీ కార్ల ధరలను పెంచగా, ద్విచక్రవాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటార్ సిరీస్‌లోని వివిధ మోడల్ బైకుల ధరలు పెంచినట్లు ప్రకటించింది. ఇక పెరిగిన ధరలు జులై 1 నుంచే అమలవుతున్నాయని ఎన్‌ఫీల్డ్ సంస్థ పేర్కొంది.
- kunduru Vinod
- Published On : July 12, 2021 / 10:03 PM IST
Royal Enfield
Royal Enfield : వాహన తయారీ కంపెనీలు తన వాహన శ్రేణిలోని పలు మోడళ్ల ధరలను పెంచేస్తున్నాయి. రవాణా చార్జీలు, ముడిపదార్ధాల ధర పెరిగిపోవడంతో వాహన తయారీ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా మారుతి సుజుకీ కార్ల ధరలను పెంచగా, ద్విచక్రవాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటార్ సిరీస్‌లోని వివిధ మోడల్ బైకుల ధరలు పెంచినట్లు ప్రకటించింది. ఇక పెరిగిన ధరలు జులై 1 నుంచే అమలవుతున్నాయని ఎన్‌ఫీల్డ్ సంస్థ పేర్కొంది.
ఇక ఏ మోడల్ ధర ఎంత పెరిగిందనే వివరాలను పరిశీలిస్తే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటార్ 350పై రూ. 7,790 పెరిగింది. గతంలో ఈ బైక్ ధర రూ.1,84,319 ఉండగా, ధర పెరిగిన తర్వాత రూ.1,92,109 చేరింది. ఇక, స్టెల్లార్ అని పిలిచే మిడ్-వేరియంట్ బైక్ పై రూ .8,020 పెరిగింది. గతంలో దీని ధర రూ. 1,90,079 గా ఉండేది. అయితే, తాజా ధరల పెంపుతో రూ. 1,98,099 చేరింది.
టాప్ ఆఫ్ ది లైన్ సూపర్నోవా వేరియంట్ పై రూ .8,405 పెంచారు. గతంలో రూ. 1,99,679 ధర వద్ద లభించేది. ధర పెంపు తర్వాత రూ .2,08,084కు చేరింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియర్ 350 బైక్ రూ. 2 లక్షల మార్కు దాటడం ఇదే మొదటిసారి.
