Microsoft ending support for Windows 7 and Windows 8 versions, here is how to upgrade
Microsoft Ending Support : ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (MicroSoft) పాత విండోస్ సిస్టమ్‌లకు త్వరలో సపోర్టును నిలిపివేయనుంది. ఇప్పటికీ Windows 7, Windows 8.1ని ఉపయోగిస్తున్న వినియోగదారులకు వచ్చే వారం నుంచి సెక్యూరిటీ అప్‌డేట్స్, టెక్నికల్ సపోర్టు లభించదు. Windows OSలో రన్ అవుతున్న కంప్యూటర్‌లకు జనవరి 10 తర్వాత అప్‌డేట్‌లు ఉండవని కంపెనీ వెల్లడించింది. పాత విండోస్ OS వెర్షన్లను వినియోగిస్తున్న యూజర్లు.. కొత్త సాఫ్ట్‌వేర్ వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ 109 (Microsoft Edge 109) బ్రౌజర్ కూడా సాఫ్ట్‌వేర్ సపోర్టును నిలిపివేయనుంది.
మైక్రోసాఫ్ట్ త్వరలో పాత Windows వెర్షన్లకు సపోర్టు నిలిపివేస్తుందనే విషయాన్ని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. దీనికి అదనంగా, Google Windows 7, Windows 8.1 వినియోగించే యూజర్లు Google Chrome సపోర్టు కూడా ఫిబ్రవరి 7న ముగియనుంది. సెక్యూరిటీ పరంగా పాత వెర్షన్‌లు సురక్షితమైన ఆప్షన్ కాదనే విషయాన్ని వినియోగదారులు గమనించాలి.
లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ సూచిస్తోంది. సాధారణంగా విండోస్ OS వెర్షన్లలో బగ్‌లను ఫిక్స్ చేయడానికి సాఫ్ట్‌వేర్‌లో ఉండే కొన్ని సెక్యూరిటీ సమస్యలను పరిష్కరించడానికి కంపెనీ కొత్త అప్‌డేట్‌లను అందిస్తుంది. ఈ అప్‌డేట్‌లు కొన్నిసార్లు యూజర్ ఎక్స్ పీరియన్స్ మెరుగుపరచేందుకు కొత్త ఫీచర్‌లను అందిస్తుంది.
Microsoft ending support for Windows 7 and Windows 8 versions, here is how to upgrade
Read Also : Windows 11 Update : విండోస్ 11 OS యూజర్లకు మైక్రోసాఫ్ట్ అలర్ట్.. తప్పక తెలుసుకోండి..!
Windows 10 లేదా Windows 11కి ఎలా అప్‌గ్రేడ్ చేయాలి? :
విండోస్ కొత్త వెర్షన్‌కి ప్రస్తుతానికి ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. లేటెస్ట్ విండోస్ వెర్షన్‌ని ఉపయోగించడానికి యూజర్లు పెద్దగా సెట్టింగ్స్ మార్పులు చేయాల్సిన అవసరం లేదు. మీ డివైజ్ కోసం Windows 10 అప్‌డేట్ రెడీగా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆయా సెట్టింగ్‌లలోని Windows అప్‌డేట్ పేజీలో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడానికి కొత్త UPGRADE అందుబాటులో ఉంటుంది. అప్పుడు మీరు మీ డివైజ్ రీస్టార్ట్ చేయాలి. ఆ తర్వాత, మీ డివైజ్ Windows 10ని రన్ చేస్తుంది. యూజర్లు తమ PC ఇప్పటికే Windows 10 2022 అప్‌డేట్‌ను అమలు చేస్తుందో లేదో కూడా చెక్ చేయవచ్చు.
ఇందుకోసం.. Windows Update సెట్టింగ్‌ల పేజీలో (View update history) ఎంచుకోవాలి. Windows 11 విషయానికొస్తే.. ప్రతి ఒక్కరూ ఈ కొత్త విండోస్ OS యాక్సెస్ చేయలేరు. ఎందుకంటే.. చాలా పాత PC లకు సపోర్టు ఇవ్వదు. PCలో Windows 11ని ఇన్‌స్టాల్ చేసేందుకు కనీస సిస్టమ్ రిక్వైర్‌మెంట్స్ ఉండాలి. మీ కంప్యూటర్ ఈ అవసరాలకు అనుగుణంగా లేకపోతే.. మీరు డివైజ్ Windows 11ని ఇన్‌స్టాల్ చేయలేరు.
Microsoft ending support for Windows 7 and Windows 8 versions
Windows 11కి కంప్యాటబుల్‌గా ఉండే కొత్త PCని కొనుగోలు చేయడం మాత్రమే ఏకైక ఆప్షన్ అని చెప్పవచ్చు. మీ PC కనీసం 4GB RAM, 1Ghz లేదా 64-bit ప్రాసెసర్‌లో 2 లేదా అంతకంటే ఎక్కువ కోర్లతో హైస్పీడ్ ఉండాలి. 64GB స్టోరేజీ, TMP 2.0 వెర్షన్, 720p డిస్‌ప్లే, DirectX 12 లేదా తర్వాత WDDM 2.0 డ్రైవర్‌తో కంప్యాటబుల్ గ్రాఫిక్స్ కార్డ్ కలిగి ఉండాలి. Microsoft అధికారిక వెబ్‌సైట్‌లో మీ పీసీలో ఎలాంటి రిక్వైర్‌మెంట్స్ కావాలో చెక్ చేసుకోవచ్చు.
మీ సిస్టమ్ లేటెస్ట్ విండోస్ వెర్షన్‌కు సపోర్టు చేస్తుందో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. సెట్టింగ్‌లలో విండోస్ అప్‌డేట్ పేజీకి వెళ్లి.. అప్‌డేట్ కోసం Check చేయవచ్చు. మీ PC Windows 10 లేదా Windows 11 Update స్వీకరించినట్లయితే.. మీరు వెంటనే కొత్త అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేయవచ్చు. మీ సిస్టమ్‌తో Windows 11 కంప్యాటబులిటీని చెక్ చేయడానికి Microsoft అధికారిక వెబ్‌సైట్ నుంచి PC హెల్త్ చెక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : Windows Update Warning : విండోస్‌కు హైసెక్యూరిటీ వార్నింగ్.. మీ విండోస్ డివైజ్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి..!