Motorola Phones : భారీ బ్యాటరీ, 12GB ర్యామ్ అదుర్స్.. ఈ రెండు మోటోరోలా ఫోన్లు అతి చౌకైన ధరకే.. కొనడం ఎలా?

Motorola Phones : మోటోరోలా ఫోన్లు చాలా చీప్ గురూ.. 12జీబీ ర్యామ్, 7000mAH బ్యాటరీతో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి.

Motorola Phones : భారీ బ్యాటరీ, 12GB ర్యామ్ అదుర్స్.. ఈ రెండు మోటోరోలా ఫోన్లు అతి చౌకైన ధరకే.. కొనడం ఎలా?

Motorola Phones : (Image Credit To Original Source)

Updated On : January 15, 2026 / 7:18 PM IST
  • అతి చౌకైన ధరలో మోటోరోలా రెండు ఫోన్లు
  • మోటోరోలా పవర్ G06 ఫోన్ ధర రూ. 8373
  • మోటోరోలా G05 4G ఫోన్ ధర రూ. 8248
  • 12GB వరకు ర్యామ్, 7000mAh బ్యాటరీ లైఫ్

Motorola Phones : మోటోరోలా అభిమానులకు అద్భుతమైన ఆఫర్.. ఈ రెండు మోటోరోలా ఫోన్లు అతి చౌకైన ధరకే కొనేసుకోవచ్చు. మోటరోలా ఫోన్ల ధర రూ. 8500 కన్నా తక్కువే. 12GB వరకు ర్యామ్, గరిష్టంగా 7000mAh బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. ఈ ఫోన్లలో 50MP ప్రైమరీ కెమెరా కూడా ఉంది.

తక్కువ ధర రేంజ్‌లో కొత్త మోటోరోలా ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే.. ఈ అద్భుతమైన ఫోన్లను కొనేసుకోవచ్చు. మోటోరోలా ఫోన్‌ల ధర రూ. 8500 కన్నా తగ్గింపు ధరకే లభిస్తున్నాయి. ఎలాంటి స్పెషల్ డీల్స్ లేకుండా తక్కువ ధరకే మోటోరోలా ఫోన్లను ఇంటికి తెచ్చుకోవచ్చు.

ఈ రెండు మోటో ఫోన్‌లు 12GB వరకు ర్యామ్, గరిష్టంగా 7000mAh బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. ఈ మోడళ్లలో 50MP ప్రైమరీ కెమెరా కూడా ఉంది. డాల్బీ అట్మాస్ సౌండ్ ఈ మోటోరోలా ఫోన్లకు స్పెషల్ ఫీచర్. ఈ మోటరోలా ఫోన్లకు సంబంధించి పూర్తి ఫీచర్లు, ధర వివరాలను పరిశీలిద్దాం..

Motorola Phones

Motorola Phones : (Image Credit To Original Source)

మోటోరోలా పవర్ G06 ఫోన్ :
అమెజాన్ ఇండియాలో ఈ మోటోరోలా ఫోన్ ధర రూ. 8373, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ 4GB ర్యామ్ అందిస్తుంది. ఈ మోటోరోలా ఫోన్‌తో 8GB వరకు వర్చువల్ ర్యామ్ అందిస్తుంది. ప్రాసెసింగ్ కోసం ఈ ఫోన్‌లో మీడియాటెక్ హెలియో G81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌ ఉండగా 6.88-అంగుళాల HD+ స్క్రీన్ అందిస్తుంది.

ఈ మానిటర్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. ఫొటోగ్రఫీ కోసం కంపెనీ 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. సెల్ఫీ కెమెరా 8MPతో వస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ 7000mAh బ్యాటరీతో 3 రోజుల వరకు ఛార్జింగ్ అందిస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ ద్వారా సపోర్టు అందిస్తుంది. క్వాలిటీ సౌండ్ కోసం డాల్బీ అట్మోస్ కూడా ఉంది.

Read Also : Bajaj Chetak e-scooter : మెటాలిక్ బాడీతో బజాజ్ చేతక్ కొత్త EV స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 113.కి.మీ రేంజ్.. ధర కూడా మీ బడ్జెట్‌లోనే..!

మోటోరోలా G05 4G ఫోన్ :
అమెజాన్ ఇండియాలో ఈ మోటోరోలా ఫోన్ ధర రూ. 8248కు పొందవచ్చు. 84GB ఇంటర్నల్ స్టోరేజ్, 4GB ర్యామ్ ఉన్నాయి. ఈ మోటోరోలా ఫోన్ ర్యామ్ బూస్ట్ ఫంక్షన్ సాయంతో మొత్తం ర్యామ్ 12GBకి పెంచవచ్చు. ఈ ఫోన్ 6.67-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది.

ఈ డిస్‌ప్లే గరిష్టంగా 1000 నిట్స్ బ్రైట్‌నెస్ లెవల్ అందిస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం కంపెనీ గొరిల్లా గ్లాస్ 3ని అందిస్తుంది. మీడియాటెక్ హీలియో G81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్ ఈ మోటోరోలా ఫోన్‌కు పవర్ అందిస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. 50MP ప్రైమరీ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అందిస్తుంది.