Bajaj Chetak e-scooter : మెటాలిక్ బాడీతో బజాజ్ చేతక్ కొత్త EV స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 113.కి.మీ రేంజ్.. ధర కూడా మీ బడ్జెట్‌లోనే..!
Bajaj Chetak e-scooter : బజాజ్ ఆటో కొత్త చేతక్ C25 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో రూ.91,399 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు లాంచ్ చేసింది. పూర్తి వివరాలివే..
Bajaj Chetak e-scooter (Image Credit To Original Source)
- ఆరు లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయం
- 6 కలర్ వేరియంట్లలో చేతక్ C25 ఈవీ స్కూటర్
- ధర రూ. 99,990 నుంచి రూ. 1.27 లక్షల వరకు
- బజాజ్ చేతక్ C25 కలర్ LCD డిస్‌ప్లే
Bajaj Chetak e-scooter : కుర్రాళ్ల కోసం సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. బజాజ్ ఆటో యువత కోసం చేతక్ C25 అనే సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఈ ఈవీ స్కూటర్ మార్కెట్లో ప్రారంభ ధర రూ. 91,399 నుంచి లభ్యం కానుంది.
ఇప్పటికే బుకింగ్‌లు అధికారికంగా ప్రారంభమయ్యాయి. చేతక్ ఫ్యామిలీలో ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ బిగ్ వెర్షన్ నుంచి కొన్ని భిన్నమైన డిజైన్ ఫీచర్లతో వస్తుంది. రాబోయే 12 నుంచి 18 నెలల్లో చేతక్ బ్రాండ్ కింద వివిధ స్కూటర్ ఫార్మాట్‌లను ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది.
డిజైన్ పరంగా పరిశీలిస్తే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గత మోడళ్ల మాదిరిగానే ఆకర్షణీయంగా ఉంది. నియో-రెట్రో వైబ్‌తో ఆకట్టుకుంటోంది. LED హెడ్‌లైట్ సింపుల్ ఆప్రాన్‌తో వస్తుంది. మినిమలిస్ట్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. సైడ్ ప్యానెల్‌లు అదే ప్యాట్రన్ ఉంటాయి. కొత్త గ్రాఫిక్స్ తో పాటు బ్యాక్ సైడ్ కొత్త టెయిల్‌లైట్ ఉంది.
చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం రెండు సిరీస్‌లలో (35, 30) నాలుగు వేరియంట్లలో (3001, 3503, 3502, 3501) అందుబాటులో ఉంది. ఈవీ స్కూటర్ ధరలు రూ. 99,990 నుంచి రూ. 1.27 లక్షల వరకు ఉన్నాయి.
6 ఏళ్ల క్రితం లాంచ్ నుంచి కంపెనీ 6 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఇందులో 2025లో 280,000 యూనిట్లు ఉన్నాయి. ముఖ్యంగా, చేతక్ కొనుగోలుదారులలో దాదాపు 40శాతం మంది 35 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు వారే ఉన్నారు.
చేతక్ C25 ఈవీ స్కూటర్ 6 కలర్ వేరియంట్లలో :
భారతీయ మార్కెట్లో మెటాలిక్ బాడీతో వచ్చిన సింగిల్ ఎలక్ట్రిక్ స్కూటర్. 25 లీటర్ల బూట్ స్పేస్ 650 mm ఫుల్ లెన్త్ సీటును అందిస్తుంది. రేసింగ్ రెడ్, మిస్టీ ఎల్లో, ఓషన్ టీల్, యాక్టివ్ బ్లాక్, ఒపలెసెంట్ సిల్వర్ క్లాసిక్ వైట్ అనే 6 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Bajaj Chetak e-scooter (Image Credit To Original Source)
Read Also :
బజాజ్ చేతక్ C25 కలర్ LCD డిస్‌ప్లే కూడా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కాల్ SMS నోటిఫికేషన్‌లు, టర్న్-బై-టర్న్ నావిగేషన్ మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా ఉంది. ఈ స్కూటర్ ఇద్దరు వ్యక్తులు ఈజీగా ప్రయాణించవచ్చు.
బ్యాటరీ పవర్ ఎంతంటే? :
కొత్త బజాజ్ చేతక్ C25 ఫ్లోర్‌బోర్డ్-మౌంటెడ్ 2.5kWh బ్యాటరీత వస్తుంది. 2.2kWh ఎలక్ట్రిక్ మోటారుకు పవర్ అందిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 113 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదు. పూర్తిగా డిశ్చార్జ్ తర్వాత బ్యాటరీ 2 గంటల 25 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. 22 కిలోల తక్కువ బరువుతో వస్తుంది. గంటకు 55 కి.మీ టాప్ స్పీడ్ అందిస్తుంది.
ఈ స్కూటర్ 750W ఆన్-బోర్డ్ ఛార్జర్‌తో వస్తుంది. 4 గంటల కన్నా తక్కువ సమయంలో 0 నుంచి 100 శాతం వరకు ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్‌లో హబ్-మౌంటెడ్ మోటార్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి.
