Apple iPhone 15 : రిపబ్లిక్ డే సేల్.. ఆపిల్ ఐఫోన్ 15పై రూ. 15వేలు తగ్గింపు.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదంతే..!
Apple iPhone 15 : కొత్త ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అతి త్వరలో రిపబ్లిక్ డే సేల్ మొదలు కానుంది. ఈ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 15 అతి తక్కువ ధరకే లభించనుంది. ఈ డీల్ ఎలా పొందాలంటే? (Image Credit To Original Source)

Apple iPhone 15 : ఆపిల్ కొత్త ఐఫోన్ కోసం ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం రిపబ్లిక్ డే సేల్ ప్రారంభానికి ముందే ఐఫోన్ 15 అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. ఆపిల్ అత్యంత పాపులర్ పొందిన ఐఫోన్ మోడల్‌లలో ఇదికొటి. ఇప్పటికే బేస్ మోడల్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది.

ఇప్పటివరకు తక్కువ ధరలో కొత్త ఐఫోన్‌ను కొనలేని వారిందకి అదిరిపోయే ఛాన్స్.. ఈ ఐఫోన్ కొంటే నేరుగా 12శాతం తగ్గింపు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌లతో మరింత డిస్కౌంట్ పొందవచ్చు. విజయ్ సేల్స్‌లో ఈ ఐఫోన్ 15కు సంబంధించి డిస్కౌంట్, ఇతర ఆఫర్ల వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

ఐఫోన్ 15పై బెస్ట్ డీల్ ఆఫర్లు : ఐఫోన్ 15 ఇప్పుడు చాలా తక్కువ ధరకే లభిస్తుంది. సెప్టెంబర్ 2023లో లాంచ్ అయిన ఐఫోన్ 15పై అతిపెద్ద ఆఫర్ ఇదే.. విజయ్ సేల్స్ ఐఫోన్ సింపుల్ 128GB మోడల్‌పై నేరుగా 12శాతం తగ్గింపు అందిస్తుంది. ఇప్పుడు ఈ ఐఫోన్ రూ.52,990కి అందుబాటులో ఉంది. ఐఫోన్ 15 ధర రూ. 59,900 ఉంటుంది. దాంతో రూ7వేలు నేరుగా తగ్గింపు పొందవచ్చు. అంతేకాదు.. మీరు ఐఫోన్ 15 ఇంకా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఈఎంఐ లావాదేవీలు, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్ ద్వారా ఈ ఐఫోన్ 15 కొనుగోలు చేస్తే.. మీకు రూ.7,500 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. తద్వారా ఈ ఐఫోన్ ధర రూ.45,400కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఐఫోన్ కొనుగోలుపై మొత్తంగా రూ. 14,500 వరకు ఆదా చేయవచ్చు.

ఆపిల్ ఐఫోన్ 15 ఫీచర్లు : ఐఫోన్ 15 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. 2000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ 60Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. iOS18 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. A16 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. డస్ట్, వాటర్ ప్రొటెక్షన్ కోసం IP68 రేటింగ్ వర్తిస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 15లో f/1.6 అపెర్చర్‌తో 48MP వైడ్-యాంగిల్ కెమెరా f/1.6 అపెర్చర్‌తో 12MP అల్ట్రా-వైడ్ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ అందిస్తుంది. సెల్ఫీల కోసం వీడియో కాల్స్ చేసేందుకు 12MP ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా ఉంది.

5G, GPS, NFC, బ్లూటూత్, Wi-Fi, USB-C కనెక్టర్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఐఫోన్‌లో బేరోమీటర్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ కంపాస్, మాగ్నెటోమీటర్ సెన్సార్లు ఉన్నాయి.
