Windows 11 Update : విండోస్‌ 11 OS యూజర్లకు మైక్రోసాఫ్ట్ అలర్ట్.. తప్పక తెలుసుకోండి..!

కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్..  ఏ డివైజ్ రన్ కావాలన్నా తప్పనిసరిగా ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాల్సిందే.. ఆపరేటింగ్ సిస్టమ్ అనగానే ఎక్కువమందికి గుర్తొచ్చేది.. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్.. 

Windows 11 Update : విండోస్‌ 11 OS యూజర్లకు మైక్రోసాఫ్ట్ అలర్ట్.. తప్పక తెలుసుకోండి..!

Microsoft Will Issue Warnings To Users Who Run Windows 11 On Unsupported Devices (1)

Windows 11 Update : కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్..  ఏ డివైజ్ రన్ కావాలన్నా తప్పనిసరిగా ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాల్సిందే.. ఆపరేటింగ్ సిస్టమ్ అనగానే ఎక్కువమందికి గుర్తొచ్చేది.. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్..  విండోస్ 7 వెర్షన్ (Windows 7) నుంచి ఇప్పుడు విండోస్ 11 వెర్షన్ కూడా వచ్చేసింది. Windows 8, Windows 10, Windows 11 OS అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ దిగ్గజం విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ అప్ డేట్స్ నిలిపివేసింది. అయినప్పటికీ చాలామంది విండోస్ యూజర్లు ఇప్పటికీ విండోస్ 7 (Windows 7) వాడుతున్నారు. యూజర్లకు తగినట్టుగానే కొత్త ఫీచర్లతో లేటెస్ట్‌ వెర్షన్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌లను మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేస్తోంది.

విండోస్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ (Windows 11)ను లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో విండోస్‌ అనేక రకాల ఫీచర్లను ప్రవేశపెట్టింది. అందులో ఫీచర్లను వినియోగించుకోవాలంటే కచ్చితంగా మీ కంప్యూటర్లలో స్పెషల్ ఫీచర్లు ఉండాల్సిందే. ఇలాంటి ఫీచర్లు అందుబాటులో లేని వారికి కూడా విండోస్ 11 సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది మైక్రోసాఫ్ట్.. విండోస్‌ 11 యూజర్లను మైక్రోసాఫ్ట్ అలర్ట్‌ చేస్తోంది. విండోస్ 11 ఉపయోగిస్తున్న యూజర్లకు ఒక అలర్ట్‌ మెసేజ్‌ను పంపుతోంది మైక్రోసాఫ్ట్‌. ప్రత్యేకమైన ఫీచర్లు లేని కంప్యూటర్లకు ‘Windows 11తో పనిచేసేందుకు మీ సిస్టమ్‌ రిక్వైర్‌మెంట్స్‌ సరిపోవు’ అనే అలర్ట్‌ను పంపుతోంది.

Microsoft Will Issue Warnings To Users Who Run Windows 11 On Unsupported Devices

Windows 11 ఉపయోగించాలంటే మీ కంప్యూటర్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండాలో తెలుసా? అందుకే మైక్రోసాఫ్ట్‌ ‘Learn More‌’ అనే లింక్‌ను అందిస్తోంది. ఈ లింక్ ద్వారా యూజర్లు తమ కంప్యూటర్లలో అవసరమైన System Requirements ఉండాలని మైక్రోసాఫ్ట్‌ సూచిస్తోంది. విండోస్‌ 11కు అవసరమైన ఫీచర్లు లేకుండా OS ఉపయోగిస్తుంటే ఫ్యూచర్‌లో మైక్రోసాఫ్ట్‌ విడుదల చేసే అప్‌డేట్స్‌ సిస్టమ్‌కు సపోర్ట్‌ చేయవని అంటోంది. యూజర్ల డేటాకు సైబర్‌ దాడుల నుంచి రక్షణ ఉండదని మైక్రోసాఫ్ట్‌ చెబుతోంది. యూజర్లు తమ డివైజ్‌లను Windows 11కి అప్‌గ్రేడ్ చేసుకోవాలని సూచిస్తోంది.

కంప్యూటర్లలో Windows 11 రన్ చేయాలంటే ముందుగా వారి సిస్టమ్ లోని రిజిస్ట్రీకి (Registry)లో కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది అలా చేసేవారికి Microsoft అధికారికంగా హెచ్చరించింది. ఇటీవలి విండోస్ ఇన్‌సైడర్ ప్రివ్యూ బిల్డ్‌లలో వార్నింగ్ మెసేజ్ పంపిస్తోంది. ఈ బిల్డ్‌లలోని సెట్టింగ్‌ల యాప్ హెడర్ సపోర్టు చేయదంటూ యూజర్లకు మెసేజ్ అలర్ట్ కనిపిస్తుంటుంది.

Read Also : Windows 11 Bug : కొత్త విండోస్‌ 11 వెర్షన్‌లో బగ్‌.. మానిటర్ రంగులు మార్చేస్తుంది..!