Microsoft will stop selling Windows 10 downloads by end of this month
Windows 10 Version Sale : ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (MicroSoft) ఈ నెలాఖరు నాటికి Windows 10 Home, Pro వెర్షన్ డౌన్‌లోడ్‌ల అమ్మకాలను నిలిపివేస్తుంది. మైక్రోసాఫ్ట్ తమ విండోస్ (Windows) వెర్షన్ సేల్ పేజీని Update చేసింది. జనవరి 31 తర్వాత ఈ విండోస్ 10 వెర్షన్ లైసెన్స్ అమ్మడం కుదరదు. ఈ కొత్త Windows 10 PCలను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఈ వెర్షన్ కోసం ప్రొడక్టు కీ (Product Keys)లు ఉండవు. 2023 ఫిబ్రవరి 1 నుంచి కొత్త సేల్ అప్‌డేట్ అందుబాటులో ఉంటుంది. కానీ, టెక్ దిగ్గజం విండోస్ పాత వెర్షన్‌కు తన సపోర్టును కొనసాగిస్తామని పేర్కొంది. Microsoft Windows 10 కోసం అక్టోబర్ 14, 2025 వరకు సాఫ్ట్‌వేర్ సపోర్టును అందిస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ సేల్ ముగిసిందనే విషయం చాలా మందికి కొంత నిరాశ కలిగించవచ్చు.
Microsoft will stop selling Windows 10 downloads by end of this month
ఎందుకంటే కంపెనీ పాత వెర్షన్‌కు సపోర్టు ఇవ్వడం ఆపివేసేందుకు ఇంకా రెండు ఏళ్ల సమయం ఉంది. కానీ, Windows 10 వెర్షన్ సేల్ కొన్ని రోజుల్లో ముగుస్తుంది. మైక్రోసాఫ్ట్ విండోస్ తన సేల్ పేజీలో (Windows 10) అక్టోబర్ 14, 2025 వరకు వైరస్‌లు, స్పైవేర్, ఇతర మాల్వేర్‌ల నుంచి మీ PCని ప్రొటెక్ట్ చేయడంలో సాయపడే సెక్యూరిటీ అప్‌డేట్స్ సపోర్టు అందిస్తుందని పేర్కొంది.
విండోస్ యూజర్లు Microsoft నుంచి Windows 10 కోసం అధికారిక ప్రొడక్టు కీలను కొనుగోలు చేయలేరు. కొత్త లైసెన్స్‌లను పొందడానికి Amazon వంటి రిటైలర్‌లపై ఆధారపడవచ్చు. అలాగే, మైక్రోసాఫ్ట్ సపోర్ట్ నిలిపివేయడానికి ముందు, థర్డ్ పార్టీల నుంచి కొన్ని ల్యాప్‌టాప్‌లు, PCలు అదే OSతో కొన్ని నెలల పాటు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.
Read Also : Windows Update Warning : విండోస్‌కు హైసెక్యూరిటీ వార్నింగ్.. మీ విండోస్ డివైజ్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి..!
వచ్చే నెల నుంచి PC బిల్డర్లు Microsoft అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే Windows 11ని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం, Windows 10 హోమ్ లేటెస్ట్ కాపీలను సైట్ ద్వారా రూ. 10,379కి కొనుగోలు చేయవచ్చు. కంపెనీ షేర్ చేసిన వివరాల ప్రకారం.. Windows 10 Pro ధర మీకు రూ. 16,515 అవుతుంది. ఈ ధరలు GSTతో సహా ఉంటాయి.
అంతేకాకుండా, టెక్ దిగ్గజం నెమ్మదిగా ఆదాయ వృద్ధికి రెడీ అవుతున్న మైక్రోసాఫ్ట్ డిలీట్ ప్లాన్లను ప్రకటించింది. FY23 Q3 చివరి నాటికి మొత్తం ఉద్యోగుల్లో 10వేల ఉద్యోగాలు తగ్గించే విధంగా మార్పులు చేస్తోంది. మైక్రోసాఫ్ట్ ఒకేసారి ఉద్యోగులందరిని తొలగించాలని ప్లాన్ చేయడం లేదు.
Microsoft will stop selling Windows 10 downloads by end of this month
కానీ, ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించింది. బాధిత ఉద్యోగులకు సెవెరెన్స్ ప్యాకేజీలను అందజేస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అమెరికాలో ఉన్న ఉద్యోగులు మార్కెట్‌కు పైబడిన వేతనం, 6 నెలల పాటు హెల్త్‌కేర్ కవరేజ్, 6 నెలల పాటు స్టాక్ అవార్డ్‌లు, కెరీర్ ట్రాన్సిషన్ సర్వీసెస్, 60 రోజుల ముందు నోటీసుతో సహా పలు రకాల బెనిఫిట్స్ అందిస్తామని అధికారిక ప్రకటన వెల్లడించింది. ఇతర మార్కెట్ల విషయానికొస్తే.. అమెరికా వెలుపల ఉన్న ఉద్యోగులకు ప్రయోజనాలు ప్రతి దేశంలోని ఉపాధి చట్టాలకు అనుగుణంగా ఉంటాయని కంపెనీ తెలిపింది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..