Windows 11 Free Update : మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ఫ్రీ అప్‌డేట్.. ఇకపై అందరికి అందుబాటులోకి.. ఎలా పొందాలంటే?

Windows 11 Free update : కొత్త మైక్రోసాఫ్ట్ విండో 11 అప్‌డేట్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. మీ డివైజ్ లేటెస్ట్ వెర్షన్‌తో ఎలా అప్‌డేట్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Microsoft's Windows 11 free update is available for all,

Windows 11 Free Update : విండోస్ 11 యూజర్ల కోసం ప్రముఖ మైక్రోసాఫ్ట్ కంపెనీ కొత్త అప్‌డేట్ ప్రకటించింది. ఈ అప్‌డేట్ చాట్‌ను (యూజర్లకు పరిమితం చేసింది) (MS Team)లతో రిప్లేస్ చేసి టాస్క్‌బార్‌కు పిన్ చేస్తుంది. విండోస్ 11 కోసం విండోస్ కోపైలట్, ఏఐ- పవర్డ్ పెయింట్, ఆల్-న్యూ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ మరిన్ని వంటి అనేక కొత్త ఫీచర్లను మైక్రోసాఫ్ట్ ప్రకటించిన తర్వాత ఈ కొత్త అప్‌డేట్ వస్తుంది. కొత్త అప్‌డేట్ విండోస్ 11 యూజర్లకు ఉచితంగా అందుబాటులో ఉంది. కొన్ని సాధారణ దశల్లో ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు కూడా విండోస్ 11 డివైజ్ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారా?

కొత్త విండోస్ 11 అప్‌డేట్ ఎలా పొందాలి? :

వివరణాత్మక బ్లాగ్ పోస్ట్‌లో.. వినియోగదారులు కొత్త అప్‌డేట్‌ను ఎలా పొందవచ్చో మైక్రోసాఫ్ట్ వివరించింది. విండోస్ 11, వెర్షన్ 22H22లో రన్ అవుతున్న డివైజ్‌లను కలిగి ఉన్నవారు ఉచితంగా అప్‌డేట్ పొందవచ్చు. వారు చేయాల్సిందల్లా Settings వెళ్లి విండోస్ (Windows Update) ఎంచుకోండి. ఆపై, ‘లేటెస్ట్ అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్న వెంటనే పొందండి”ని ఆన్ చేసి ‘Check for updates’ ఎంచుకోండి. మీ PC అప్‌డేట్ కోసం రెడీగా ఉంటే.. మీరు ‘Update Now’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.

Read Also : Windows New Update : విండోస్‌లో కొత్త అప్‌డేట్.. స్ర్కీన్‌షాట్ ఎడిటింగ్‌లో బగ్.. ఫిక్స్ చేసిన మైక్రోసాఫ్ట్.. ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి!

మరోవైపు.. మైక్రోసాఫ్ట్ కొత్త అప్‌డేట్ దానితో పాటు ఫీచర్లను కూడా రివీల్ చేసింది. కంపెనీ అప్‌డేట్‌ను ‘స్కోప్డ్, క్యుములేటివ్ రిలీజ్’ అని పేర్కొంది. ఇందులో కొన్ని కొత్త అప్‌గ్రేడ్‌లతో పాటు ఇటీవల ప్రకటించిన అన్ని ఫీచర్‌లు ఉన్నాయి. ‘చాట్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ టీమ్స్ (Free), టాస్క్‌బార్‌కి డిఫాల్ట్‌గా పిన్ అయింది. మీరు మైక్రోసాఫ్ట్ టీమ్‌లను లాంచ్ చేసేందుకు క్లిక్ చేసినప్పుడు, మీరు చాట్ చేయడం, కాల్ చేయడం, కలవడం, కమ్యూనిటీ గ్రూపుల కోసం స్పేస్‌ను క్రియేట్ చేసే షార్ట్ కమ్యూనికేషన్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. దీనికి అదనంగా, అప్‌డేట్ మీ అప్లికేషన్‌లను మేనేజ్ చేసే విధానాన్ని కూడా మారుస్తుంది. విండోస్ 11 సిస్టమ్ భాగాలు ‘సిస్టమ్’ లేబుల్‌ను కలిగి ఉంటాయి. సెట్టింగ్‌లలో కొత్త సెక్షన్‌లో ఉంటుంది. ఈ యాప్‌లను మేనేజ్ చేయడం, అన్‌ఇన్‌స్టాల్ చేసేందుకు వీలుగా ఉంటుంది.

విండోస్ 11కి ఎలా అప్‌గ్రేడ్ చేయాలి? :

మీరు Windows 11కి అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తున్నారా? ఇదే సరైన సమయం.. అర్హత ఉన్న డివైజ్‌లను అప్‌గ్రేడ్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. విండోస్ 11 నిర్దిష్ట రిక్వైర్‌‌మెంట్స్ ఉన్న డివైజ్‌లలో మాత్రమే రన్ అవుతుంది. మీ డివైజ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రన్ చేయగలదో లేదో తెలుసుకోవడానికి మీరు ఈ రిక్వైర్‌మెంట్స్ చెక్ చేయడానికి మైక్రోసాఫ్ట్ సపోర్టు పేజీకి వెళ్లవచ్చు. విండోస్ 11తో మీ సిస్టమ్ కంపాటబిలిటీని చెక్ చేయడానికి మీరు మైక్రోసాఫ్ట్ వెబ్‌సైట్‌ విజిట్ చేయొచ్చు. మీ సిస్టమ్ కంప్యాటబిలిటీ కలిగి ఉంటే.. విండోస్ 11కి అప్‌గ్రేడ్ చేసేందుకు ఈ కిందివిధంగా ఫాలో చేయండి.

Microsoft Windows 11 free update 

* Start Menu నుంచి Settings వెళ్లండి.
* Update & Security ఆప్షన్ గుర్తించి దానిపై Click చేయండి.
* Update కోసం Check ఎంచుకోండి. Windows 11 అప్‌గ్రేడ్ ఆప్షన్ కనిపించే స్క్రీన్ కోసం వేచి ఉండండి.
* ‘Download and install‘పై క్లిక్ చేసి, మీ డివైజ్ అప్‌గ్రేడ్ చేయడానికి Windows కోసం Wait ఉండండి.
మైక్రోసాఫ్ట్ ఈ రోజుల్లో AIపై మరింత ఎక్కువగా దృష్టి సారిస్తోంది. దాదాపు అన్ని ప్రొడక్టులకు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని తీసుకువస్తోంది. కంపెనీ Bing సెర్చ్ ఇంజిన్ ఈ ఏడాదిలో రీప్రెష్ అయింది. తద్వారా (Bing AI) చాట్‌కి వెల్‌కమ్ తెలిపింది. బింగ్ ఏఐ చాట్ రీసెర్చ్ నిర్వహించడానికి, ఫొటోలను రూపొందించడానికి, వ్యాసాలను తిరిగి రాయడం వంటి మరెన్నో విషయాలకు ఉపయోగించవచ్చు.

Read Also : Windows 11 Free Upgrade : విండోస్ 7, 8 యూజర్లకు అలర్ట్.. విండోస్ 11కు ఫ్రీగా అప్‌గ్రేడ్ చేసుకోలేరు.. ఎందుకో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు