MIUI 14 announced globally_ Check out features, eligible devices, and other details
MIUI 14 Software Update : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) లేటెస్ట్ MIUI 14 స్కిన్‌ను లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లతో పాటు MWC 2023 ఈవెంట్‌లో ఆవిష్కరించింది. Xiaomi నుంచి సరికొత్త కస్టమ్ ఆండ్రాయిడ్ స్కిన్ కొత్త Xiaomi 13 సిరీస్‌తో అందిస్తోంది. కంపెనీ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను పొందే డివైజ్‌ల జాబితాను కూడా ధృవీకరించింది. ఈ ఫ్లాగ్‌షిప్ సిరీస్ 3 ఫోన్‌లను కలిగి ఉండగా.. బ్రాండ్ భారత మార్కెట్లో Xiaomi 13 Pro మోడల్‌ను మాత్రమే అందిస్తోంది. దీని ధర ఫిబ్రవరి 28న అధికారికంగా వెల్లడి కానుంది. MIUI 14 స్కిన్ కొత్త అప్‌డేట్ అర్హత గల డివైజ్‌ల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
MIUI 14 : అర్హత కలిగిన డివైజ్‌లివే :
కంపెనీ వివరాల ప్రకారం.. 2023 మొదటి త్రైమాసికంలో MIUI 14 అప్‌డేట్‌ను పొందే కొన్ని డివైజ్‌ల్లో Xiaomi 12T Pro, Xiaomi 12T, Xiaomi 12 Pro, Xiaomi 12, Mi 11 Ultra, Mi 11i, Xiaomi 12X, Xiaomi 12 Lite, Xiaomi 11T Pro, Xiaomi 11T, Mi 11, Xiaomi 11 Lite 5G NE, Mi 11 Lite 5G, Mi 11 Lite ఉన్నాయి. కొన్ని Redmi ఫోన్‌లు MIUI 14ని పొందడానికి అర్హులు అని చెప్పవచ్చు. ఇటీవలే రిలీజ్ చేసిన Redmi Note 11 Pro+ 5G ఫోన్ కూడా ఉంటుంది. ఈ జాబితాలో Redmi Note 10 Pro, Redmi Note 10, Redmi 10 5G కూడా ఉన్నాయి.
MIUI 14 Software Update : MIUI 14 announced globally Check out features, eligible devices
Read Also : 2023 Tata Safari ADAS : 2023 టాటా సఫారి ADAS కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్ల కోసమైన ఈ కారు కొనాల్సిందే..!
MIUI 14 : టాప్ ఫీచర్లు ఇవే :
లేటెస్ట్ MIUI 14 వెర్షన్ ద్వారా మీ ఫొటోలు, క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ సర్వీసులను గరిష్టంగా 9 మంది వ్యక్తులతో షేర్ చేయగల సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇతర యూజర్ల విషయాలను షేర్ చేయడానికి ఎవరైనా కుటుంబ అకౌంట్ క్రియేట్ చేయాలి. కస్టమ్ ఆండ్రాయిడ్ స్కిన్ ఇప్పుడు యూజర్లు ఎక్కువగా ఉపయోగించని యాప్‌లను ఆటోమేటిక్‌గా కంప్రెస్ చేస్తుంది. ఇందుకోసం నోటిఫికేషన్‌లను కూడా ఆఫ్ చేయొచ్చు. మీ ఫోన్‌లో స్టోరేజీ స్థలాన్ని ఆదా చేయడంలో సాయపడే డూప్లికేట్ ఫైల్ మెర్జర్ ఫీచర్‌ను కూడా పొందవచ్చు. కొత్త వెర్షన్ గ్యాలరీ ఫొటోల నుంచి టెక్స్ట్‌ను గుర్తించి మరింత మెరుగైన రీతిలో కంపెనీ పేర్కొంది.
Xiaomi ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, యూజర్ డేటా లోకల్ ఆన్-డేటా డివైజ్ ప్రాసెసింగ్‌తో ప్రైవసీని మెరుగుపరిచింది. ప్రైవసీ విషయంలో యూజర్లు ఇప్పుడు రిలీఫ్ పొందవచ్చు. డిజైన్ పరంగా, MIUI 14 వెర్షన్ పెద్ద ఐకాన్‌లతో కస్టమైజడ్ ఫోల్డర్‌లను అందిస్తుంది. కొన్ని కొత్త విడ్జెట్ ఆప్షన్లు ఇప్పుడు అనేక షేప్, సైజులలో అందుబాటులో ఉన్నాయి. Xiaomi యూజర్లు ఇతర Xiaomi (TWS ఇయర్‌బడ్‌లు) సులభంగా కనెక్ట్ అయ్యేలా కొత్త కంట్రోల్ సెంటర్ టోగుల్ కూడా ఉంది. CPU, GPU పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో కెర్నల్-స్థాయి ఆప్టిమైజేషన్లతో సహా కొన్ని ఇంటర్నల్ మార్పులు కూడా ఉన్నాయి.