Mobile Phones ధరలు పెరుగుతాయి – ICEA

  • Publish Date - October 3, 2020 / 09:18 AM IST

Mobile Phones : ఫోన్ల ధరలు పెరుగుతాయని ICEA వెల్లడిస్తోంది. ఫోన్ల డిస్ ప్లేలపై ప్రభుత్వం 10 శాతం దిగుమంతి సుంకం విధించడం వల్ల ధరలు 3 శాతం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. 2016లో పరిశ్రమల అంగీకారంతో ప్రకటించిన దశలవారీ తయారీ పథకం (PMP) కింద తెరలపై సుంకాన్ని అక్టోబర్ 01వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చారు.



డిస్ ప్లే (Display), అసెంబ్లీ, టచ్ ప్యానెల్ లపై సుంకాలు విధించనున్నారు. దీనికారణంగా..ఫోన్ల ధరలపై 1-5-3 శాతం వరకు ప్రభావం పడే అవకాశం ఉందని ICEA జాతీయ ఛైర్మన్ పంకజ్ మొహింద్రూ వెల్లడించారు.
కరోనా వైరస్, NGT అనుమతుల ఆలస్యం కారణంగా..పరిశ్రమ డిస్ ప్లే తయారీని సరిపడా చేయలేకపోయిందని, దేశీయ విడిభాగాల తయారీకి పూర్తిగా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారాయన.



అయితే..దిగుమతులకు ప్రత్యామ్నాయం సృష్టించడమే కాకుండా..అంతర్జాతీయంగా ఉన్న మార్కెట్ల వాటాను పొందడంపై దృష్టి పెట్టామన్నారు. దేశంలో తొలి LCD తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయడానికి అనిల్ అగర్వాల్ కు చెందిన వోల్కాన్ ఇన్వస్టిమెంట్ ప్రతిపాదించినా..ప్రభుత్వ అనుమతులు రాకపోవడం వల్ల ..ముందడుగు పడలేదని ఐసీఈఏ వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు