Moto G Play 2024 Phone : మోటో జీ ప్లే 2024 ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలుసా?

Moto G Play 2024 Phone : మోటో నుంచి సరికొత్త జీ ప్లే 2024 వెర్షన్ మోడల్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. 50ఎంపీ రియర్ కెమెరా ఫీచర్లు, భారీ బ్యాటరీ సపోర్టుతో అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Moto G Play 2024 With Snapdragon 680 SoC, 50-Megapixel Rear Camera Launched

Moto G Play 2024 Phone Launch : ప్రముఖ మోటోరోలా కంపెనీ నుంచి కొత్త మోటో జీ ప్లే 2024 మోడల్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో వచ్చింది. మోటో జీ ప్లే కొత్త మోడల్ ఫోన్ ఎంపిక చేసిన ఉత్తర అమెరికా మార్కెట్‌లలో లాంచ్ అయింది. డిసెంబర్ 2022లో ఆవిష్కరించిన మోటో జీ ప్లే (2023)కు ఇది అప్‌గ్రేడ్ వెర్షన్ స్మార్ట్‌ఫోన్. పాత మోడల్‌పై అనేక అప్‌గ్రేడ్‌లతో వస్తుంది.

Read Also : EPFO Aadhaar Card : ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన.. ఇకపై పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డు పనికిరాదు.. వ్యాలీడ్ డాక్యుమెంట్లు ఇవే..!

ఈ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అవుతుందా లేదా అనేది కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో ఆధారితమైనది. 5,000ఎంఎహెచ్ బ్యాటరీకి సపోర్టు ఇస్తుంది. 50ఎంపీ రియర్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను సెంట్రల్ హోల్-పంచ్ స్లాట్‌తో వస్తుంది.

మోటో జీ ప్లే (2024) ధర, లభ్యత :
మోటో జీ ప్లే ఫోన్ (2024) ఒకే (Sapphire) బ్లూ షేడ్‌లో అందిస్తుంది. ఈ ఫోన్ 4జీబీ + 64జీబీ కాన్ఫిగరేషన్ ధర 149.99 డాలర్లు (దాదాపు రూ. 12,500)గా ఉంది. అమెజాన్ ప్లాట్‌ఫారం (Amazon.com, Best Buy, Motorola.com) ద్వారా ఫిబ్రవరి 8 నుంచి అమెరికాలో విక్రయానికి రానుంది. ఆ తర్వాత ఇతర రిటైలర్ల ద్వారా అందుబాటులో ఉంటుంది. కెనడాలో జనవరి 26న ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Moto G Play 2024 Launched

మోటో జీ ప్లే (2024) స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
కొత్తగా లాంచ్ అయిన మోటో జీ ప్లే (2024) మోడల్ ఫోన్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో 6.5-అంగుళాల హెచ్‌డీ+ (1,600 x 720 పిక్సెల్‌లు) ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ అడ్రినో 610 జీపీయూతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. 4జీబీ ర్యామ్‌తో వస్తుంది. వాస్తవంగా 6జీబీ వరకు విస్తరించవచ్చు. 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రన్ అవుతుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. మోటో జీ ప్లే (2024) ఒకే 50ఎంపీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. క్వాడ్-పిక్సెల్ సెన్సార్ బ్యాక్ ప్యానెల్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో పాటుగా కొద్దిగా పెరిగిన దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్‌పై వస్తుంది. ఫ్రంట్ కెమెరా 8ఎంపీ సెన్సార్‌తో వస్తుంది. మోటో జీ ప్లే (2024)కి 5,000ఎంఎహెచ్ బ్యాటరీ సపోర్టు అందిస్తుంది.

సింగిల్ ఛార్జ్ చేయడం ద్వారా గరిష్టంగా 46 గంటల బ్యాటరీ లైఫ్ అందజేస్తుంది. 15డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టుతో వస్తుంది. ఈ ఫోన్ దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ52 రేటింగ్‌తో వస్తుంది. 4జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ 5.1 కనెక్టివిటీని అందిస్తుంది. ఈ మోడల్ బరువు 185గ్రాములు, 163.82ఎమ్ఎమ్x 74.96ఎమ్ఎమ్x 8.29ఎమ్ఎమ్ పరిమాణంలో ఉంటుంది.

Read Also : Samsung Galaxy S24 Series : భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ ధర తెలిసిందోచ్.. ప్రీ-ఆర్డర్ల కోసం ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!

ట్రెండింగ్ వార్తలు