Moto G34 5G complete price and specs revealed online ahead of January 9 launch
Moto G34 5G Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా నెక్స్ట్ జనరేషన్ జీ సిరీస్ స్మార్ట్‌ఫోన్ మోటో జీ34 5జీ వచ్చే వారం భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని ఇప్పటికే కంపెనీ ధృవీకరించింది. జనవరి 9 మధ్యాహ్నం 12 గంటలకు అధికారిక లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
మోటో జీ34 5జీ స్పెసిఫికేషన్స్ :
మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించిన స్పెసిఫికేషన్‌ల ప్రకారం.. మోటో జీ34 5జీ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుంది. గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం అడ్రినో 619 జీపీయూతో రానుంది. మోటో జీ34 5జీ ఫోన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1600 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ ఐపీ52 వాటర్-రిపెల్లెంట్ డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది. 180 గ్రాముల బరువు ఉంటుంది.
Moto G34 5G price and specs
ఆప్టిక్స్ పరంగా.. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ మాక్రో సెన్సార్ ఉంటాయి. ఆ సెల్ఫీ, వీడియో కాలింగ్ అవసరాలకు స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 16ఎంపీ కెమెరా ఉంది. మోటో జీ34 5జీ ఫోన్ 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. బాక్స్ లోపల 20డబ్ల్యూ ఛార్జర్ ద్వారా వేగంగా ఛార్జ్ అవుతుంది. సాఫ్ట్‌వేర్ పరంగా మోటో జీ34 5జీ సరికొత్త ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా మైయూఎక్స్‌లో రన్ అవుతుంది. ఈ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌తో ఒక ఏడాది ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లను అందించనుంది.
మోటో జీ34 5జీ ధర (అంచనా) :
91మొబైల్స్ నివేదిక ప్రకారం.. మోటో జీ34 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 10,999 ధర నిర్ణయించింది. ఇంతలో, 8జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఇంకా నిర్ధారించలేదు. మోటో జీ43 5జీ ఫోన్ చార్‌కోల్ బ్లాక్, ఐస్ బ్లూ, ఓషన్ గ్రీన్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. బ్లాక్ కలర్ వేరియంట్ కూడా వేగన్ లెదర్ బ్యాక్‌తో వస్తుంది.