Moto G34 5G Launch : ఈ నెల 9న భారత్‌కు మోటో G34 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Moto G34 5G Launch : మోటోరోలా నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేస్తోంది. మోటో జీ34 5జీ ఫోన్ జనవరి 9న మధ్యాహ్నం 12 గంటలకు భారతీయ మార్కెట్లోకి లాంచ్ కానుంది. మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది.

Moto G34 5G with leather finish set to launch in India

Moto G34 5G Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా భారత్‌లో మోటో జీ34 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ధృవీకరించింది. ఈ డివైజ్ జనవరి 9న మధ్యాహ్నం 12గంటలకు మార్కెట్లోకి లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. అంతేకాదు.. మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Read Also : Redmi Note 13 Series : భారత్‌కు రెడ్‌మి నోట్ 13 5జీ సిరీస్ వచ్చేసింది.. కేవలం ధర రూ.16,999 మాత్రమే.. సేల్ డేట్ ఎప్పుడంటే?

బడ్జెట్ మోటరోలా ఫోన్ వేగన్ లెదర్ ఎండ్, స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీని కలిగి ఉంది. మోటో జీ34 5జీ మోడల్ వాస్తవానికి డిసెంబర్ 2023లో చైనీస్ మార్కెట్‌లో లాంచ్ అయింది. వచ్చే వారం నాటికి భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. లాంచ్‌కు ముందు, ఫ్లిప్‌కార్ట్ కీలకమైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లతో కూడిన ప్రత్యేక మైక్రోసైట్‌ను ఆవిష్కరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భారత్‌లో మోటో జీ34 5జీ ధర (అంచనా) :
చైనాలో ప్రస్తుతం మోటో జీ34 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ +128జీబీ స్టోరేజ్ వేరియంట్ సీఎన్‌వై 999 (సుమారు రూ. 11,600) వద్ద అందుబాటులో ఉంది. భారతీయ ధర చైనీస్ కౌంటర్‌తో సమానంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ డివైజ్ రెడ్‌మి 13సి, శాంసంగ్ గెలాక్సీ ఎం14 వంటి ఫోన్‌లతో పోటీపడే అవకాశం ఉంది. ఈ కొత్త మోటరోలా ఫోన్ ధర రూ.15వేల లోపు ఉండవచ్చని అంచనా.

భారత మార్కెట్లో వినియోగదారులు గరిష్టంగా 8జీబీ ర్యామ్, 128జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ వేరియంట్‌లను పొందవచ్చు. వెరిఫైడ్ కాన్ఫిగరేషన్‌తో పాటు 4జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజీతో అదనపు వేరియంట్ గురించి ఊహాగానాలు ఉన్నాయి. అయితే, భారత మార్కెట్‌కు సంబంధించిన ధర వివరాలు వెల్లడించలేదు.

Moto G34 5G launch in India

మోటో జీ34 5జీ స్పెసిఫికేషన్‌లు :
ఫ్లిప్‌కార్ట్ జాబితాలో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను వెల్లడిస్తుంది. మోటో జీ34 5జీ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. కంపెనీ ప్రకారం.. ఈ డివైజ్ పర్ఫార్మెన్స్ మెరుగుపరిచే వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఒక ముఖ్యమైన ఫీచర్. స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌తో వేగవంతమైన 5జీ హ్యాండ్‌సెట్ అని బ్రాండ్ పేర్కొంది.

ఆప్టిక్స్ వారీగా చూస్తే.. మోటో జీ34 5జీ ఫోన్ 50ఎంపీ ప్రైమరీ సెన్సార్ 2ఎంపీ మాక్రో సెన్సార్‌ను కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో, 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఐపీ52-రేటెడ్ బిల్డ్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఈ డివైజ్ పవర్‌ఫుల్ 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీ కూడా ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు రిటైల్ బాక్స్‌లో కంపెనీ ఛార్జర్‌ను అందించనుంది. మిగిలిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

Read Also : Vivo X100 Series Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? ట్రిపుల్ కెమెరాలతో వివో నుంచి X100 సిరీస్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

ట్రెండింగ్ వార్తలు