Moto G45 5G Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటో G45 5జీ సేల్ మొదలైందోచ్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Moto G45 5G Sale : కొత్త మోటో జీ45 ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999కు పొందవచ్చు. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999కు పొందవచ్చు.

Moto G45 5G goes on sale in India ( Image Source : Google )

Moto G45 5G Sale : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా సరికొత్త 5జీ ఫోన్ సేల్ మొదలైంది. ఇటీవలే భారత మార్కెట్లో మోటో జీ45 5జీ లాంచ్ చేసింది. పోటీ సమర్పణతో సరసమైన 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించింది. మోటో జీ45 5జీ ఇప్పుడు అమ్మకానికి ఉంది.

ఫ్లిప్‌కార్ట్, (Motorola.in), భారత్‌లో ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 10,999 అయితే, ఆసక్తిగల కొనుగోలుదారులు లాంచ్ ఆఫర్‌లతో తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also : iPhone 16 Series Price : ఐఫోన్ 16 సిరీస్ ధర, కీలక ఫీచర్లు లీక్.. అన్ని మోడల్స్‌కు ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టు..!

మోటో జీ45 5జీ భారత్ ధర, సేల్ ఆఫర్లు :
కొత్త మోటో జీ45 ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999కు పొందవచ్చు. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999కు పొందవచ్చు. లాంచ్ ఆఫర్‌ల విషయానికొస్తే.. ఆసక్తిగల కస్టమర్‌లు యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసిన కొనుగోళ్లపై రూ. వెయ్యి ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్‌తో మోటో జీ45 5జీ మోడల్ 4జీబీ ర్యామ్ మోడల్‌కు ధర రూ. 9,999, 8జీబీ ర్యామ్ మోడల్‌కు రూ. 11,999కి పడిపోతుంది.

మోటో జీ45 5జీ స్పెషిఫికేషన్లు, డిజైన్ :
మోటో జీ45 5జీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జనరేషన్ 3 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. 8జీబీ వరకు ర్యామ్ ద్వారా బ్యాకప్ పొందవచ్చు. ర్యామ్ బూస్ట్ ఫీచర్‌తో 16జీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఈ ఫోన్ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో వస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. బడ్జెట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ 3 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.

డిజైన్ పరంగా, మోటో జీ45 5జీ వేగన్ లెదర్ ఎండ్, ఐపీ52 వాటర్ రెసిస్టెన్స్, స్లిమ్ ప్రొఫైల్‌తో వస్తుంది. బ్రిలియంట్ బ్లూ, బ్రిలియంట్ గ్రీన్, వివా మెజెంటా అనే మొత్తం 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ 13 5జీ బ్యాండ్‌లు, విఓఎన్ఆర్ 4 వరకు క్యారియర్ అగ్రిగేషన్‌తో సహా అడ్వాన్స్‌డ్ 5జీ సామర్థ్యాలను కూడా కలిగి ఉంది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. కొత్తగా లాంచ్ అయిన మోటో జీ45 5జీలో 50ఎంపీ క్వాడ్ పిక్సెల్ బ్యాక్ కెమెరా, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 20డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది. అనేక ఇతర బ్రాండ్‌ల మాదిరిగానే మోటరోలా కూడా స్మార్ట్‌ఫోన్‌తో ఛార్జర్‌ను అందిస్తుంది.

Read Also : Apple iPhone 16 Series : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ వచ్చేస్తోంది.. ఎయిర్ ప్యాడ్స్, ఆపిల్ వాచ్ కూడా..!

ట్రెండింగ్ వార్తలు