Moto Tag 2 Launch : మోటో ట్యాగ్ 2 వచ్చేసింది.. 600 రోజుల బ్యాటరీతో స్మార్ట్ ట్రాకింగ్ గేమ్ చేంజర్.. ధర జస్ట్..!
Moto Tag 2 Launch : మోటోరోలా నుంచి కొత్త మోటో ట్యాగ్ 2 ట్రాకింగ్ డివైజ్ లాంచ్ అయింది. 600 రోజుల బ్యాటరీ లైఫ్‌తో ఈ డివైజ్ కు మీ వస్తువులను ఈజీగా ట్యాగ్ చేయొచ్చు. అలాగే ట్రాకింగ్ చేయొచ్చు.
- Sreehari A
- Updated on- May 13, 2026 / 07:18 PM IST
Moto Tag 2 Launch ( Illustration generated using AI )
- పర్సులో లేదా వాలెట్‌లో ఈజీగా తీసుకువెళ్లవచ్చు
- బ్లూటూత్ 6.0 బ్లూటూత్ ఛానల్ సౌండింగ్‌తో వస్తుంది
- డైరెక్షన్ పాయింటర్లతో ఏ దిశగా వెళ్ళాలో చెబుతుంది
Moto Tag 2 Launch : మోటోరోలా లవర్స్ కోసం అద్భుతమైన డివైజ్.. మోటో ట్యాగ్ 2 అనే కొత్త ట్రాకింగ్ డివైజ్ వచ్చేసింది. ఈ ట్రాకింగ్ డివైజ్ అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. యూజర్లు ఈజీగా తమ స్మార్ట్‌ఫోన్‌తో ట్రాక్ చేయొచ్చు.
బ్యాగులు, పర్సులు, తాళాలు, ఇతర రోజువారీ వస్తువులకు ట్యాగ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ కోసం గూగుల్ ఫైండ్ హబ్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతుంది. మోటోరోలా ఈ కొత్త ట్రాకింగ్ డివైజ్ ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మోటో ట్యాగ్ 2 ధర, లభ్యత :
మోటో ట్యాగ్ 2 యూకే జర్మనీ వంటి ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయింది. ఈ డివైజ్ ధర యూకేలో £29.99 (సుమారుగా రూ. 3,800) జర్మనీలో €40 (సుమారుగా రూ. 4,400)గా ఉంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంది. గ్రీన్, ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Read Also : iQOO 15T Launch : గేమర్లకు పండగే.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త సూపర్ ఫోన్!
మోటో ట్యాగ్ 2 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
మోటో ట్యాగ్ 2 అనేది కంపెనీ సరికొత్త ట్రాకర్ డివైజ్. చాలా సన్నని సైజుతో వస్తుంది. ఈజీగా పర్సులో లేదా వాలెట్‌లో పెట్టుకోవచ్చు. కంపెనీ మోటో ట్యాగ్ 2లో అల్ట్రావైడ్ బ్యాండ్‌కు సపోర్టును అందించింది. బ్లూటూత్ 6.0 బ్లూటూత్ ఛానల్ సౌండ్‌తో వస్తుంది.
ఇతర ట్రెడిషనల్ బ్లూటూత్ ట్రాకర్‌లతో పోలిస్తే.. మరింత కచ్చితమైన ట్రాకింగ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. దీనికి డైరెక్షన్ పాయింటర్ కూడా ఉంది. అంటే.. మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా పోగొట్టుకున్న వస్తువును ఈజీగా కనిపెట్టొచ్చు. వస్తువు దగ్గరలో ఉందని చెప్పడమే కాదు.. ఏ డైరెక్షన్‌లో వెళ్ళాలో కూడా మీకు అనమాట.
అతిపెద్ద హైలైట్ ఫీచర్ బ్యాటరీ అనే చెప్పాలి. ఇందులో రిమూవబుల్ CR2032 బ్యాటరీ ఉంటుంది. సింగిల్ ఛార్జ్‌పై 600 రోజుల వరకు వస్తుందని కంపెనీ పేర్కొంది. గత మోడల్‌లో కంపెనీ ఒక ఏడాది వరకు బ్యాటరీ లైఫ్‌ను అందించింది. డస్ట్, వాటర్ నుంచి ప్రొటెక్షన్ కోసం మోటో ట్యాగ్ 2కు IP68 రేటింగ్ ఉంది.
తేలికపాటి వర్షం, నీటి తుంపరలు, బయటి దుమ్ము కారణంగా వెంటనే పాడవదని అంటున్నారు. ఫోన్‌కు రింగ్ కోసం ఒక ఇంటర్నల్ బటన్‌తో వస్తుంది. అవసరమైతే కెమెరా షట్టర్‌ను కూడా ట్యాప్ చేయొచ్చు.
