BSNL Prepaid Plans : BSNL బంపర్ ప్లాన్లు.. ఒక్క రీఛార్జ్‌తో డేటా డబుల్ + ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్.. ఈ తేదీ వరకే..!
BSNL Prepaid Plans : బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం రెండు ప్రీపెయిడ్ ప్లాన్లపై ఫ్రీ బోనస్ డేటాను ప్రకటించింది. ఈ ఆఫర్ జూన్ 30 వరకు వ్యాలిడిటీతో అందుబాటులో ఉంటుంది. పూర్తి ప్లాన్ ఆఫర్ వివరాలివే..
BSNL Prepaid Plan
- బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్లపై బోనస్ డేటా ఆఫర్
- రూ. 997 ప్లాన్‌పై 5GB అదనపు డేటా పొందొచ్చు
- రూ. 1999 ప్లాన్‌తో 10GB బోనస్ డేటా కూడా
BSNL Prepaid Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఫాదర్స్ డే 2026 సందర్భంగా తమ యూజర్ల కోసం సరికొత్త ప్రమోషనల్ ఆఫర్ ప్రవేశపెట్టింది. ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్లపై అదనపు మొబైల్ డేటాను అందిస్తోంది.
ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎక్కువ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ కోసం (BSNL Prepaid Plans) చూస్తున్న కస్టమర్లకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ #RechargeForPapa అనే సోషల్ మీడియా ప్రచారంలో భాగంగా ఈ ఆఫర్‌ను ప్రకటించింది.
కంపెనీ ప్రకారం.. ఈ ఆఫర్లో రూ. 997, రూ. 1999తో రెండు ప్రీపెయిడ్ ప్లాన్లపై బోనస్ డేటా అందిస్తోంది. ఈ అదనపు డేటా కోసం ఎలాంటి అదనపు ఖర్చు ఉండదు. కుటుంబ సభ్యులు, మీ స్నేహితులతో ఈజీగా కనెక్ట్ అవ్వొచ్చు. ఈ ప్రమోషనల్ ఆఫర్ జూన్ 21, 2026 నుంచి ప్రారంభమై జూన్ 30, 2026 వరకు వ్యాలిడిటీ ఉంటుందని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. బోనస్ డేటా కోసం కస్టమర్లు ఈ వ్యవధిలోపు రీఛార్జ్ చేసుకుంటే చాలు..
From your first word to life’s biggest milestones, Dad has always been there.
This Father’s Day, stay connected with extra data from BSNL and make every moment count.
Recharge smart via #BReX
👉 https://t.co/41wNbHpQ5c#BSNLIndia #StayConnected #BSNLServices #SmartIndia… pic.twitter.com/j9E8HwmmhH— BSNL India (@BSNLCorporate) June 20, 2026
బీఎస్ఎన్ఎల్ రూ. 997 ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్ 150 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB డేటా, ఏ నెట్‌వర్క్‌కైనా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఫాదర్స్ డే సందర్భంగా కస్టమర్లు ఈ ప్లాన్‌పై అదనంగా 5GB డేటా కూడా పొందవచ్చు.
బీఎస్ఎన్ఎల్ రూ. 1999 ప్లాన్ :
లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే యూజర్ల కోసం బీఎస్ఎన్ఎల్ రూ. 1999 ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ 330 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కస్టమర్లు రోజుకు 1.5GB డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌తో కంపెనీ 10GB బోనస్ డేటా కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ వ్యవధిలో రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు బెస్ట్ అని చెప్పొచ్చు.
