Motorola Edge 50 Neo launched in India, price starts from Rs 23,999
Motorola Edge 50 Neo Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా నుంచి సరికొత్త సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. అదే.. మోటో ఎడ్జ్ 50 నియో ఫోన్.. భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ. 30వేల కేటగిరీలో వస్తుంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా మోటో ఎడ్జ్ 50 నియో ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఫీచర్లలో బ్యాక్ సైడ్ టెలిఫోటో సెన్సార్, ఐపీ రేటింగ్, 1.5కె డిస్‌ప్లే, స్టీరియో స్పీకర్లు వంటి ఆకర్షణీయమైన స్పెషిఫికేషన్లను కలిగి ఉంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మోటో ఎడ్జ్ 50 నియో : భారత్ ధర, సేల్, ఆఫర్లు :
మోటో ఎడ్జ్ 50 నియో ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ధర రూ.23,999కు ఆఫర్ చేస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 50 నియో ప్రత్యేక సేల్ సెప్టెంబర్ 16న రాత్రి 7 గంటలకు ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభం కానుంది. లాంచ్ ఆఫర్‌లలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు రూ. వెయ్యి వరకు డిస్కౌంట్ క్లెయిమ్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ పాంటోన్-సర్టిఫైడ్ నాటికల్ బ్లూ, లాట్టే, గ్రిసైల్, పోయిన్సియానా వేగన్ లెదర్ ఎండ్ అనే 4 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
మోటో ఎడ్జ్ 50 నియో స్పెషిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 నియో 6.4-అంగుళాల 1.5కె పోలెడ్ ఎల్‌టీపీఓ డిస్‌ప్లేతో వస్తుంది. ప్యానెల్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు అందిస్తుంది. 3,000 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ఫోన్ పవర్ అందిస్తుంది. మృదువైన పర్ఫార్మెన్స్ కోసం ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో సపోర్టు అందిస్తుంది.
మోటోరోలా 5ఏళ్ల వరకు ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనుంది. కెమెరా ముందు స్మార్ట్‌ఫోన్ ఓఐఎస్ సపోర్టుతో 50ఎంపీ సోనీ ఎల్‌వైటీఐఏ 700సి ప్రైమరీ సెన్సార్, 13ఎంపీ అల్ట్రా-వైడ్/మాక్రో కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 10ఎంపీ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 32ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 50 నియో 68డబ్ల్యూ వైర్డు, 15డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,310mAh బ్యాటరీని అందిస్తుంది. అదనంగా, ఈ ఫోన్ నీరు, ధూళి నిరోధకతకు ఐపీ68-రేటింగ్‌తో పాటు తీవ్రమైన పరిస్థితుల్లో మన్నికకు ఎమ్ఐఎల్-ఎస్‌టీడీ 810హెచ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో డ్యూయల్ స్పీకర్లు, బయోమెట్రిక్స్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి.