Motorola Edge 50 Ultra 5G : మోటోరోలా అభిమానులకు పండగే.. కొత్త మోటోరోలా ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. రూ.45వేల బడ్జెట్ లోపు హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఈ అద్భుతమైన ఆఫర్ అసలు వదులుకోవద్దు. గత జనరేషన్ మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.22వేల డిస్కౌంట్‌తో లభిస్తోంది.
2/6
ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిజైన్, టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్, పర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకునేలా ఉంది. ఇలాంటి అద్భుతమైన డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఆల్‌రౌండ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఈ మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీ తీసుకోవచ్చు. ఇంతకీ ఈ ఫోన్ ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/6
ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా అల్ట్రా 5జీ ధర ఎంతంటే? : మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రూ.44,999కు అందుబాటులో ఉంది. అసలు ధర రూ.64,999 ఉండగా ఇప్పుడు రూ.20వేల భారీ తగ్గింపుతో లభిస్తోంది. అదనంగా, కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో రూ.2,500 డిస్కౌంట్ పొందవచ్చు. ఫైనల్ వాల్యూ రూ.42,499 కన్నా తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.
4/6
మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే ఇంకా తగ్గింపు ధరకే పొందవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీ ఫోన్ రూ.41,950 వరకు ఉంటుంది. అయితే, మీ స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్ ఆధారంగా ఇంకా తగ్గింపు పొందవచ్చు. అదనంగా, కస్టమర్లు 36 నెలలకు నెలకు రూ.1,758 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు.
5/6
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 6.7-అంగుళాల pOLED స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ 2,500 నిట్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ద్వారా పవర్ పొందుతుంది. 12GB ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది.
6/6
ఈ మోటోరోలా ఫోన్ 4,500mAh బ్యాటరీ, 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఆప్టిక్స్ పరంగా ఈ మోటోరోలా ఫోన్ 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్, 64MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.