Motorola Edge 50 Ultra 5G : బంపర్ డిస్కౌంట్ భయ్యా.. ఈ మోటోరోలా అల్ట్రా 5G ఫోన్ మరి ఇంత తక్కువా? అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
Motorola Edge 50 Ultra 5G : మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఏకంగా రూ. 26వేల లోపు ధరకు తగ్గింది. అమెజాన్ లో ఇలా కొనేసుకోండి చాలు..
- Sreehari A
- Published On : April 11, 2026 / 01:04 PM IST
Motorola Edge 50 Ultra 5G : మోటోరోలా అభిమానులకు అదిరిపోయే ఆఫర్.. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూసేవారు ఈ ఫోన్ అసలు మిస్ చేసుకోవద్దు.
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీ ఫోన్ అత్యుత్తమ ప్రాసెసర్, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. బ్యాంక్ లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ ఆఫర్‌ను మరింత తగ్గించుకోవచ్చు.
అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీ డీల్ : భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీ ఫోన్ రూ. 64,999 ధరకు లాంచ్ అయింది. ఇప్పుడు అమెజాన్‌లో రూ. 38,990 ధరకు లభిస్తోంది. అంటే రూ. 26,009 తగ్గింది. అలాగే, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా రూ. 2,500 ధర తగ్గింపు ఆఫర్ కూడా పొందవచ్చు.
మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే గరిష్టంగా రూ. 36,600 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అమెజాన్ నుంచి రూ. 1,371 ప్రారంభమయ్యే ఈఎంఐ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీ కొనాలా? వద్దా? : మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీతో అద్భుతమైన పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే క్వాలిటీ వంటి హై లెవల్ టెక్నాలజీని అందిస్తుంది. ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల pOLED డిస్‌ప్లే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్ 2,500 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్ సపోర్టుతో బయట కూడా డిస్‌ప్లే క్లియర్‌గా కనిపిస్తుంది.
ఇందులో అద్భుతమైన 500MHz క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో పాటు 12GB ర్యామ్, 512GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉన్నాయి. 4,500mAh బ్యాటరీతో ఈ ఫోన్ 125W అవుట్‌పుట్ పవర్ లెవెల్ కేబుల్ ద్వారా 50W వైర్‌లెస్ ఛార్జింగ్ ద్వారా కూడా ఛార్జ్ చేయవచ్చు.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఇందులో 50MP ప్రైమరీ లెన్స్, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 64MP టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్-కెమెరా సిస్టమ్ ఉంది. ఫ్రంట్ సైడ్ 50MP రిజల్యూషన్‌తో సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
