×
Ad

Motorola Edge 50 Ultra 5G : మోటోరోలా ఫ్యాన్స్ మీకోసమే.. ఈ మోటోరోలా 5జీ ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

Motorola Edge 50 Ultra 5G : కొత్త మోటోరోలా ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీ ఫోన్ ఏకంగా రూ. 15వేల తగ్గింపుతో లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ అసలు వదులుకోవద్దు..

1/5
Motorola Edge 50 Ultra 5G : కొత్త మోటోరోలా ఫోన్ కావాలా? మీరు ప్రీమియం ఫ్లాగ్‌షిప్-లెవల్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 15వేల కన్నా భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా కనీస డిజైన్, కర్వడ్ అమోల్డ్ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
2/5
ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G ధర : మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఇప్పుడు రూ.15వేల ధర తగ్గింపు తర్వాత రూ.49,999కి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉంటే మీరు ఈ ఫోన్‌పై రూ.4వేల వరకు సేవ్ చేసుకోవచ్చు. ధర రూ.45,999 కన్నా తగ్గింపు పొందవచ్చు.
3/5
మీ పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో కూడా పొందవచ్చు. ఫోన్ వాల్యూ రూ.41,700 వరకు ఉంటుంది. అయితే, కచ్చితమైన వాల్యూ, వర్కింగ్ కండిషన్స్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. కొనుగోలుదారులు నెలకు రూ.1,758 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు. ఎక్స్‌టెండెడ్ వారంటీ వంటి యాడ్-ఆన్‌లు కూడా ఉన్నాయి.
4/5
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ 6.7-అంగుళాల సూపర్ 1.5K pOLED ప్యానెల్‌, 144Hz రిఫ్రెష్ రేట్, 2,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. హుడ్ కింద, ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.
5/5
కెమెరా విషయానికొస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాలో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ సెన్సార్, 3x ఆప్టికల్ సెన్సార్‌తో 64MP టెలిఫోటో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా కలిగి ఉంది. ఇంకా, ఈ మోటోరోలా ఫోన్ 125W ఛార్జింగ్ 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీ కలిగి ఉంది.