Motorola Edge 60 Fusion : బిగ్ డిస్కౌంట్.. అతి తక్కువ ధరకే మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు.. డోంట్ మిస్!

Motorola Edge 60 Fusion : మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ధర తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో GOAT సేల్ సందర్భంగా సరసమైన ధరకే లభిస్తోంది..

Motorola Edge 60 Fusion

Motorola Edge 60 Fusion : మోటోరోలా ఫ్యాన్స్ మీకోసమే.. ప్రస్తుతం మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ భారీగా తగ్గింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ను (Motorola Edge 60 Fusion) అసలు ధర కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఆకర్షణీయమైన బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. జూలై 12 నుంచి జూలై 17 వరకు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో GOAT సేల్ సమయంలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..

మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ డిస్కౌంట్ :
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఫోన్ రెండు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. 256GB స్టోరేజ్‌తో 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో 12GB ర్యా్మ్ కలిగి ఉంది. రూ. 3వేల ధర తగ్గింపుతో బేస్ మోడల్ ఇప్పుడు రూ. 22,999 ధరకు అందుబాటులో ఉంది. అంతేకాకుండా, కొనుగోలుదారులు 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

పాత ఫోన్‌ను కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ. 17,650 వరకు ఆదా చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ రూ.8వేలు ధర పలికితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.15వేల ధరకు పొందవచ్చు. అయితే, కచ్చితమైన వాల్యూ అనేది మీ పాత స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండిషన్ బట్టి ఉంటుంది.

Read Also : Vivo X200 FE Launch : వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త వివో X200 FE ఫోన్ ఇదిగో.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతంటే?

మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్పెసిఫికేషన్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 6.67-అంగుళాల pOLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. 1.5K రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 3D కర్వ్డ్ డిజైన్, స్మార్ట్ వాటర్ టచ్ 3.0, యాంటీ-ఫింగర్‌ప్రింట్ కోటింగ్‌ను కలిగి ఉంది.

గీతలు పడకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అందిస్తుంది. హుడ్ కింద, ఎడ్జ్ 60 ఫ్యూజన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB ర్యామ్ లేదా 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 5,500mAh బ్యాటరీతో వస్తుంది. 68W టర్బో ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌కు సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హలో UIపై రన్ అవుతుంది. గూగుల్ జెమిని ద్వారా ఆధారితమైన ఏఐ యాక్టివిటీని కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ కెమెరా ఫ్రంట్, బ్యాక్ సైడ్ డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50MP మెయిన్ కెమెరా, 13MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. డాల్బీ అట్మోస్ ఆడియో, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్ ఉన్నాయి.