Vivo X200 FE Launch : వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త వివో X200 FE ఫోన్ ఇదిగో.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతంటే?

Vivo X200 FE Launch : కొత్త వివో X200 FE ఫోన్ లాంచ్ అయింది. మీడియాటెక్ డైమన్షిటీ 9300 ప్లస్ SoC, 6500mAh బ్యాటరీ కలిగి ఉంది.

Vivo X200 FE Launch : వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త వివో X200 FE ఫోన్ ఇదిగో.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతంటే?

Vivo X200 FE Launch

Updated On : July 15, 2025 / 12:07 PM IST

Vivo X200 FE Launch : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి వివో నుంచి X200 FE ఫోన్ వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.31-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే,  (Vivo X200 FE Launch) కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 9300+ చిప్‌సెట్‌తో పాటు 16GB వరకు LPDDR5X ర్యామ్, 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీని కలిగి ఉంది. Zeiss-బ్యాక్డ్ 50MP ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 50MP సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. వివో X200 FE ఫోన్ ఫీచర్లు, ధర వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

భారత్‌లో వివో X200 FE ధర :
భారత మార్కెట్లో వివో X200 FE (12GB + 256GB) వేరియంట్ ధర రూ. 54,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, 16GB + 512GB వేరియంట్ ధర రూ. 59,999కు లభిస్తోంది. అంబర్ ఎల్లో, ఫ్రాస్ట్ బ్లూ, లక్స్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ జూలై 23 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్ ద్వారా అమ్మకానికి వస్తుంది. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది.

వివో X200 FE స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వివో X200 FE ఫోన్ 6.31-అంగుళాల 1.5K (1,216×2,640 పిక్సెల్స్) అమోల్డ్ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ గ్లోబల్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 9300+ SoC ద్వారా 16GB వరకు LPDDR5X ర్యామ్, 512GB వరకు UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత FuntouchOS 15తో వస్తుంది.

Read Also : Motorola Edge 50 : సూపర్ ఆఫర్.. మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్ అతి తక్కువ ధరకే.. ఇలా కొన్నారంటే?

ఆప్టిక్స్ విషయానికొస్తే.. వివో X200 FEలో Zeiss-బ్యాక్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50MP సోనీ IMX921 ప్రైమరీ సెన్సార్, 120-డిగ్రీల వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8MP సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్, OIS సపోర్ట్‌తో 50MP సోనీ IMX882 పెరిస్కోప్ టెలిఫోటో షూటర్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఈ ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP సెన్సార్ కలిగి ఉంది.

వివో X200 FE ఫోన్ 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీని కలిగి ఉంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డస్ట్, వాటర్ రెసిస్టెన్సీ కోసం IP68+IP69 రేటింగ్‌లను కలిగి ఉంది. డ్యూయల్ నానో సిమ్, 5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, OTG, NFC, USB టైప్-C కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ సైజు 150.83×71.76×7.99mm, బరువు 186 గ్రాములు ఉంటుంది.