Motorola Edge 50 : సూపర్ ఆఫర్.. మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్ అతి తక్కువ ధరకే.. ఇలా కొన్నారంటే?

Motorola Edge 50 : మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

Motorola Edge 50 : సూపర్ ఆఫర్.. మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్ అతి తక్కువ ధరకే.. ఇలా కొన్నారంటే?

Motorola Edge 50

Updated On : July 15, 2025 / 11:06 AM IST

Motorola Edge 50 : మోటోరోలా ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌ ద్వారా ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్ రూ. 20వేల కన్నా తక్కువ ధరకు (Motorola Edge 50) అమ్ముడవుతోంది. గత ఏడాదిలో మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్ రూ. 30వేల లోపు ధరలో లాంచ్ అయింది.

ప్రీమియం డిజైన్, ఆకట్టుకునే హార్డ్‌వేర్ సెట్‌తో మిడ్-రేంజ్ కేటగిరీలో అద్భుతమైన ఫోన్. కర్వ్డ్ డిస్‌ప్లే, వీగన్ లెదర్ బ్యాక్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. జూలై 17 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 డీల్ :
ప్రస్తుతం మోటోరోలా ఎడ్జ్ 50 లాంచ్ ధర రూ.27,999 ఉండగా రూ.21,999కు అమ్ముడవుతోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.1,250 వరకు 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఇంకా, కొనుగోలుదారులు తమ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. రూ.18వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ వాల్యూ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

Read Also : iQOO Z10R Launch : ఐక్యూ లవర్స్ కోసం కొత్త ఫోన్.. ఐక్యూ Z10R వచ్చేస్తోందోచ్.. ధర, స్పెసిఫికేషన్లపై అంచనాలివే..!

మోటోరోలా ఎడ్జ్ 50 స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 5G ఫోన్ సూపర్ HD (1220p) రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 యాక్సిలరేటెడ్ ఎడిషన్ చిప్‌సెట్‌తో 12GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది.

కెమెరా విషయానికొస్తే.. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో సోనీ LYTIA 700C సెన్సార్‌తో 50MP అల్ట్రా పిక్సెల్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ సెన్సార్ బ్యాక్ సైడ్ 10MP సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ మోటోరోలా ఫోన్ 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇంకా, మోటోరోలా ఎడ్జ్ 50 68W టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 15W వరకు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.