అదిరిపోయే ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. రెడీనా?

మిడ్‌ రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌ కొనుక్కోవాలని అనుకుంటున్న వారికి మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో మంచి ఆప్షన్.

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే లాంచ్‌ కానుంది. దీని గురించి అధికారికంగా వివరాలు రాకపోయినప్పటికీ దాని ధర, ఫీచర్ల గురించి లీకులు వస్తున్నాయి. మిడ్‌ రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌ కొనుక్కోవాలని అనుకుంటున్న వారికి మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో మంచి ఆప్షన్.

డిజైన్, ఫీచర్లు
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5జీ బ్యాక్‌ సైడ్‌లో పౌక్స్‌ లెథర్ ప్యానెల్‌తో విడుదల కానుంది. సాఫ్ట్‌ ఎడ్జ్‌ స్క్వేర్ కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది. పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెటప్‌తో లాంచ్‌ అవుతుంది. ఇందులో ఫిజికల్‌ బటన్‌ను కూడా ఉండొచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5జీ 144 హెర్ట్‌జ్‌ రిఫ్రెష్ రేటుతో 6.7-అంగుళాల AMOLED ప్యానెల్‌తో వస్తుంది. ఇది మీడియాటెక్ మెరిజెన్సిటీ 8350 పవర్‌తో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 12GB ఎల్పీడీడీఆర్‌5ఎస్‌ ర్యామ్‌, 512GB UFS 3.1 స్టోరేజ్‌తో వచ్చే అవకాశం ఉంది.

Also Read: గవర్నర్లకు ఉండే అధికారాలపై సుప్రీంకోర్టు ల్యాండ్‌మార్క్‌ లాంటి తీర్పు.. ఇకపై..

ఈ స్మార్ట్‌ఫోన్‌ Android 15లో రన్‌ అవుతుంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,100 mAh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చే అవకాశం ఉంది. ఇక కెమెరా విషయానికి వస్తే OIS, 10MP సెకండరీ సెన్సార్, 13MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో 50MP ప్రైమరీ కెమెరాతో ఇది విడుదల కానుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 20MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఈ స్మార్ట్‌ఫోన్ రావచ్చు.

లాంచ్‌ డేట్, ధర
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5జీ ఈ నెలలో భారత్‌లో లాంచ్ కావచ్చని లీకుల ద్వారా తెలుస్తోంది. బీఐఎస్‌ సర్టిఫికేషన్‌ ఆధారంగా ఈ లాంచ్‌ తేదీని విశ్లేషకులు అంచనా వేశారు. అధికారికంగా ఇంకా లాంచ్ తేదీని ప్రకటించలేదు.

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5జీ ధర భారత మార్కెట్లో సుమారు రూ.31,999గా ఉండొచ్చు. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5జీ ధర గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటన రావచ్చు.