Motorola Edge 60 Stylus : వారెవ్వా.. మోటోరోలా ఫోన్ ఇంత తక్కువా? అమెజాన్‌లో జస్ట్ రూ. 19వేల లోపే.. ఇలా కొన్నారంటే?
Motorola Edge 60 Stylus : మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ధర రూ. 19వేలకే కొనేసుకోవచ్చు.
- Sreehari A
- Published On : April 1, 2026 / 05:35 PM IST
Motorola Edge 60 Stylus
- మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ రూ. 19,000 లోపు ధరకే
- స్మూత్ డిస్‌ప్లే, అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఇంటర్నల్ స్టైలస్
- బ్యాంక్, క్రెడిట్ కార్డ్ ఆఫర్లతో రూ. 1,500 వరకు తగ్గింపు
Motorola Edge 60 Stylus : మోటోరోలా ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్. మోటోరోలా మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో సరసమైన ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ఫస్ట్ రూ. 22,999 ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్‌లో భారీ తగ్గింపు ధరకు లభిస్తోంది.
ఎంపిక చేసిన బ్యాంక్, కార్డ్ ఆఫర్లతో ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ మోటోరోలా ఫోన్ భారీ POLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ అద్భుతమైన ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ డీల్ :
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ రూ. 22,999 ధరతో లాంచ్ అయింది. కానీ, ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్‌లో రూ. 20,388 తగ్గింపు ధరతో లభిస్తోంది. రూ. 2,611 నేరుగా తగ్గింపు పొందవచ్చు. అయితే, కొనుగోలుదారులు బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్లతో ధర రూ. 1,500 వరకు తగ్గుతుంది.
Read Also : Gmail Username : జీమెయిల్‌లో సరికొత్త ఫీచర్.. ఇక మీ ‘యూజర్‌నేమ్’ మార్చుకోవచ్చు.. పాత డేటా ఫుల్ సేఫ్..!
ఈ ప్లాట్‌ఫామ్ రూ. 717 నుంచి ఈఎంఐ తగ్గింపుతో అందిస్తోంది. మీ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ మోడల్, కండిషన్ బట్టి, రూ. 19,350 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్‌లో 6.7-అంగుళాల pOLED డిస్‌ప్లే ఉంది. ఫుల్ HD+ డిస్‌ప్లే రిజల్యూషన్ అందిస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. ఈ మోటోరోలా ఫోన్ 3000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఇంటర్నల్ స్టైలస్ ఆప్షన్ ఉంది. అలాగే క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ ఉంది. 8GB ర్యామ్ కూడా ఉంది. 256GB ఇంటర్నల్ స్టోరేజీ ఉంది.
మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా ఇంటర్నల్ స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15తో రన్ అవుతుంది. మోటో యూఐ ఫీచర్లు ఉన్నాయి. కెమెరా విషయానికి వస్తే.. 50MP ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ కొనాలా? వద్దా? :
పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే పరంగా మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ అద్భుతంగా ఉంటుంది. ఈ ధరలో స్టైలస్ పెన్‌తో వచ్చే ఏకైక ఫోన్ ఇదే. అమెజాన్‌లో ఈ ఫోన్ చాలా చౌకగా లభిస్తోంది.
