×
Ad

Motorola Edge 70 Launch : భలే ఉంది భయ్యా ఫోన్.. కొత్త మోటోరోలా ఎడ్జ్ 70 అదిరింది.. 50MP ట్రిపుల్ కెమెరా హైలెట్.. ధర కూడా మీ బడ్జెట్ ధరలోనే..!

Motorola Edge 70 Launch : కొత్త మోటోరోలా కొంటున్నారా? 50MP సెల్ఫీ కెమెరాతో సరికొత్త మోటోరోలా ఎడ్జ్ 70 ఫోన్ లాంచ్ అయింది. అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది.

Motorola Edge 70 Launch

Motorola Edge 70 Launch : కొత్త మోటోరోలా ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లోకి పవర్‌ఫుల్ ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. అద్భుతమైన కలర్ ఆప్షన్లతో వినియోగదారులను ఆకర్షించేలా ఉంది. ఈ ఫోన్ 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది.

అదనంగా, 8GB ర్యామ్, 16GB వరకు వర్చువల్ ర్యామ్ ఆప్షన్‌తో వస్తుంది. ఈ ఫోన్ 50MP మెయిన్ కెమెరాతో (Motorola Edge 70 Launch) లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 16లో రన్ అవుతుంది. ధర రూ. 29,999కు కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్‌ను కంపెనీ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇతర ఫీచర్లు, సేల్ ఆఫర్లపై ఇప్పుడు వివరంగా చూద్దాం..

భారీ డిస్‌ప్లే, గ్లాస్ ప్రొటెక్షన్ :
మోటోరోలా ఎడ్జ్ 70లో 6.7-అంగుళాల 1.5K 10-బిట్ pOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2712 x 1220 పిక్సెల్ రిజల్యూషన్, 4500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో వస్తుంది.

స్మార్ట్‌ఫోన్ సైజు, బరువు :
మోటోరోలా ఎడ్జ్ 70 ఫోన్ కొలతలు 159.87x 74.28x 5.99mm, బరువు 159 గ్రాములు. ఈ ఫోన్ 5.99mm మందం కలిగి ఉంటుంది.

పర్ఫార్మెన్స్, ఆపరేటింగ్ సిస్టమ్ :
ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 3 ఏళ్ల OS అప్‌డేట్‌లు, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లతో వస్తుంది.

Read Also : Realme Narzo 90 5G : రియల్‌మి నార్జో 90 5G సిరీస్ వచ్చేసిందోచ్.. భారీ బ్యాటరీ, 50MP కెమెరాలు.. సింగిల్ ఛార్జ్‌తో 2 రోజుల బ్యాకప్.. ధర ఎంతంటే?

కెమెరా సెటప్ ఇదే :
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ కెమెరా ఫోన్ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 50MP సెకండరీ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. మెటల్ ఫ్రేమ్‌తో ఈ ఫోన్ దుమ్ము, నీటి నిరోధకతకు IP68+IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. మోటో ఏఐ 2.0తో స్పెషల్ ఏఐ AI కీ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

68W ఛార్జింగ్ సపోర్ట్ :

ఈ మోటోరోలా ఫోన్ 5000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఛార్జింగ్ కోసం ఫోన్‌లో USB టైప్-C పోర్ట్ కూడా ఉంది.

ఫోన్ ధర ఎంతంటే? :
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో సింగిల్ వేరియంట్‌లో వస్తుంది. ధర రూ. 29,999కు పొందవచ్చు. ప్యాంటోన్ లిల్లీ ప్యాడ్, ప్యాంటోన్ గాడ్జెట్ గ్రే, ప్యాంటోన్ బ్రాంజ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

సేల్ ఎప్పుడంటే? :
ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 23 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటరోలా వెబ్‌సైట్ ద్వారా అమ్మకానికి వస్తుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌పై రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

ఇతర ఫీచర్లు :
ఇందులో స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్ ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6E 802.11ax (2.4GHz/5GHz), బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C 2.0, NFC సపోర్టు ఉన్నాయి.

మోటో ఏఐ 2.0 అప్‌గ్రేడ్ :
ఆసక్తికర విషయం ఏమిటంటే.. మోటో ఏఐ 2.0 ఇప్పుడు స్పెషల్ AI కీతో వస్తుంది. ఇందులో AI ఇమేజ్ స్టూడియో, స్కెచ్ టు ఇమేజ్, స్టైల్ సింక్, టెక్స్ట్ టు స్టిక్కర్ అవతార్ క్రియేషన్ వంటి క్రియేటివిటీ టూల్స్ కూడా ఉన్నాయి. మీరు క్యాచ్ మీ అప్ 2.0, పే అటెన్షన్ లైవ్ ట్రాన్స్క్రిప్షన్, ఏఐ ప్లేలిస్ట్ స్టూడియో, గ్లోబల్ సెర్చ్, ఆటో స్క్రీన్ షాట్ బ్లర్ దిస్ ఆన్ దట్ వంటి ఫీచర్లను పొందవచ్చు. మీ మెమెరీస్ సేవ్ చేయండి. పెర్ప్లెక్సిటీ ఏఐ ద్వారా మీకు ఏది అవసరమో అది ఈజీగా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు.