కిర్రాక్ స్మార్ట్‌ఫోన్‌.. ఎలా ఉందంటే? లాంచ్‌ కాకముందే Motorola Edge 70 ఫీచర్లు తెలిసిపోయాయి!

అవే కలర్లతో మోటోరోలా ఎడ్జ్ 70ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది.

మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు బయటకు వచ్చాయి. ఆ కంపెనీ వీటి గురించి అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ లీకుల ద్వారా ఫీచర్లు బయటపడ్డాయి. డ్యూయల్ కర్వ్డ్ డిస్‌ప్లే, వీగన్ లెదర్ ఫినిష్, ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ వస్తున్నట్లు తెలిసింది.

మోటోరోలా ఎడ్జ్ 70 డిజైన్, ఫీచర్లు
గత స్మార్ట్‌ఫోన్లతో పోల్చితే అనేక అప్‌గ్రేడ్‌లతో మోటోరోలా ఎడ్జ్ 70 వస్తున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. 6.7-అంగుళాల డ్యూయల్ కర్వ్డ్ pOLED డిస్ప్లే ఉండనుంది. మోటరోలా ఎడ్జ్ 60ని వంటి డిజైన్‌ ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. బ్యాక్ ప్యానెల్ వీగన్ లెదర్ ఫినిషింగ్‌తో ఉండే అవకాశం ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ గ్రీన్‌ కలర్‌లో వస్తున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. అయితే, మరిన్ని కలర్లలోనూ దీన్ని విడుదల చేయొచ్చు. ఇప్పటికే మోటోరోలా ఎడ్జ్‌ 60 బ్లూ, గ్రీన్‌ కలర్లలో ఉంది. అవే కలర్లతో మోటోరోలా ఎడ్జ్ 70ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది.

మోటోరోలా ఎడ్జ్ 70లో అల్యూమినియం మిడిల్ ఫ్రేమ్‌ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని చెబుతున్నారు. కెమెరా విషయానికి వస్తే 50MP ప్రధాన సెన్సార్‌తో వస్తుందని తెలుస్తోంది. 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా ఉంటుందని భావిస్తున్నారు.

మోటోరోలా ఎడ్జ్ 60లాగే ఇందులోనూ 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరా లేదా అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్ ఉండవచ్చు. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7000 సిరీస్ చిప్‌సెట్‌తో రన్న అవుతుందని చెప్పొచ్చు. ఈ ఫోన్ 12GB RAMతో వచ్చే అవకాశం ఉంది. అధికారికంగా లాంచ్‌ తేదీ వెల్లడికానప్పటికీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదల అవుతుందని తెలుస్తోంది.