Motorola Escape 210 Price : మోటోరోలా సరికొత్త ఆఫర్.. కేవలం రూ.1,949 ధరకే బ్లూటూత్ హెడ్‌ఫోన్.. డోంట్ మిస్!

Motorola Escape 210 Price : మోటోరోలా సరికొత్త ఆఫర్ అందిస్తోంది. మోటోరోలా ఎస్కేప్ 210 బ్లూటూత్ హెడ్‌ఫోన్ తక్కువ ధరకు అందుబాటులో ఉంది. కేవలం రూ.1,949 ధరకే సొంతం చేసుకోవచ్చు.

Motorola Escape 210 Bluetooth Headphone price drops

Motorola Escape 210 Price : కొత్త బ్లూటూత్ హెడ్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ మోటోరోలా (Motorola) నుంచి సరికొత్త బ్లూటూత్ హెడ్‌సెట్‌పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. మోటోరోలా (Motorola Escape 210) బ్లూటూత్ హెడ్‌ఫోన్ ఇప్పుడు రూ.3,299కి బదులుగా .1,949కు అందుబాటులో ఉంది.

Read Also : Motorola G62 5G : ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా G62 5G ఫోన్‌పై బెస్ట్ ఆఫర్లు, 29శాతం డిస్కౌంట్.. డోంట్ మిస్..!

మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ అద్భుతమైన డీల్‌ని పొందవచ్చు. మోటరోలా ఎస్కేప్ 210 బ్లూటూత్ హెడ్‌ఫోన్ ధర భారీ 40శాతం తగ్గింపుతో ఇ-కామర్స్ సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌లో సొంతం చేసుకోవచ్చు. అంటే.. రూ.3,299 నుంచి రూ.1,949కి తగ్గించవచ్చు. బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Motorola Escape 210 Bluetooth Headphone price drops

మోటోరోలా ఎస్కేప్ 210 బ్లూటూత్ హెడ్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
40mm డ్రైవర్లతో లైవ్ డిస్‌ప్లే చూస్తున్నట్లుగా మ్యూజిక్ వినవచ్చు. మోటోరోలా Escape 210 బ్లూటూత్ హెడ్‌ఫోన్ క్రిస్టల్-క్లియర్ హెచ్చుతగ్గులతో అద్భుతమైన బాస్ ఎఫెక్ట్ అందిస్తుంది. మ్యూజిక్ వినవచ్చు. ఈ మోటోరోలా హెడ్‌సెట్ ఫోల్డబుల్ డిజైన్‌ను కలిగి ఉంది. మీరు ఎక్కడికి వెళ్లినా సులభంగా క్యారీ చేసేందుకు అనుమతిస్తుంది.

ఇంట్లో లేదా వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు చాలా ఎంటర్‌టైన్మెంట్ అందిస్తుంది. ఈ మోటోరోలా హెడ్‌సెట్‌ని గూగుల్ అసిస్టెంట్, సిరికి సపోర్టు అందిస్తుంది. మీరు ఫోన్ కాల్‌లకు సమాధానం ఇవ్వవచ్చు లేదా తిరస్కరించవచ్చు. మీ ప్లే లిస్టులో స్క్రోల్ చేయవచ్చు. వాల్యూమ్‌ని ఎడ్జెస్ట్ చేయవచ్చు.

Read Also : Realme C53 Sale : అత్యంత సరసమైన ధరకే రియల్‌మి C53 ఫోన్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

ట్రెండింగ్ వార్తలు