Moto G35 Launch : మోటోరోలా మోటో G35 ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

Motorola Moto G35 Launch : భారత మార్కెట్లో మోటో జీ35 ఫోన్ ధర రూ.9,999కు పొందవచ్చు. డిసెంబర్ 16 న మొదటిసారిగా విక్రయానికి రానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది.

Motorola Moto G35 launched in India

Motorola Moto G35 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో మోటోరోలా కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటో G35 లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ. 10వేల కన్నా తక్కువకు కొనుగోలు చేయొచ్చు. తక్కువ ధర పరిధిలో హై-ఎండ్ ఫీచర్‌లతో వస్తుంది. ఈ ఫోన్ కొన్ని 4కె వీడియో రికార్డింగ్, 1,000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 120Hz డిస్‌ప్లే, వేగన్ లెదర్ డిజైన్, డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్, డిస్‌ప్లే కోసం స్మార్ట్ వాటర్ టచ్ టెక్ వంటి పూర్తి ఫీచర్లు ఉన్నాయి.

మోటో జీ35 భారత్ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో మోటో జీ35 ఫోన్ ధర రూ.9,999కు పొందవచ్చు. డిసెంబర్ 16 న మొదటిసారిగా విక్రయానికి రానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్లోని రిటైల్ స్టోర్‌లు లేదా మోటరోలా ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు.

మోటో జీ35 స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
కొత్త మోటోరోలా మోటో జీ35 స్మార్ట్‌ఫోన్ కనిష్ట బెజెల్స్‌తో భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. దిగువన పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6.7-అంగుళాల 120Hz ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను 1,000నిట్స్ గరిష్ట ప్రకాశంతో కలిగి ఉంది. ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 కోటింగ్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్టును కలిగి ఉంది. మోటరోలా కూడా ఈ ఫోన్ తడి చేతులతో కూడా వినియోగించవచ్చు. బడ్జెట్ ఫోన్‌కు బెస్ట్ ఫీచర్ అని చెప్పవచ్చు.

బ్యాక్‌సైడ్ 50ఎంపీ మెయిన్ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వినియోగదారులు 4కె రిజల్యూషన్‌లో కూడా వీడియోలను రికార్డ్ చేయగలరని బ్రాండ్ చెబుతోంది. ఫ్రంట్ సైడ్ 16ఎంపీ సెల్ఫీ కెమెరాను చూడవచ్చు. హుడ్ కింద ఒక యూనిసోక్ టీ760 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. మోటోరోలా యూజర్లు ఒక ఏడాదిలో ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతారని పేర్కొంది.

ఈ ఫోన్ ప్రస్తుతం పాత ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌లో రన్ అవుతోంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఓఎస్ అర్హత కలిగి ఉంది. 20డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,000mAh బ్యాటరీ ఉంది. కంపెనీ ఫోన్‌తో పాటు రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను బండిల్ చేస్తుంది. కొత్త మోటరోలా ఫోన్‌లో ఐపీ52 రేటింగ్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే తడి చేతులతో కూడా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. డాల్బీ అట్మోస్‌కు సపోర్టుతో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.

Read Also : iPhone Data Transfer : ఐఫోన్ నుంచి పీసీ లేదా మ్యాక్‌కు డేటాను ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!