Motorola Razr 40 Ultra : మోటోరోలా నుంచి మడతబెట్టే ఫోన్.. రెజర్ 40 అల్ట్రా కొత్త కలర్ వేరియంట్ వచ్చేసిందోచ్!

Motorola Razr 40 Ultra : కొత్త మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్ మరో కలర్ వేరియంట్ లాంచ్ అయింది. రెజర్ 40 అల్ట్రా ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు పూర్తి వివరాలను ఓసారి చూద్దాం.

Motorola Razr 40 Ultra New Glacier Blue Colour Variant Launched

Motorola Razr 40 Ultra : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా నుంచి మోటోరోలా రెజర్ 40 అల్ట్రా ఫోన్ మరో కొత్త కలర్ వేరియంట్‌ వచ్చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో జూలైలో భారత మార్కెట్లో లాంచ్ అయిన మోటోరోలా రెజర్ 40 అల్ట్రా ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ఎస్ఓసీ 30డబ్ల్యూ వైర్డు, 5డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 3,800ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది.

క్లామ్‌షెల్ ఫోల్డబుల్ బేస్ మోటోరోలా రెజర్ 40తో పాటు వచ్చింది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్‌సెట్, 30డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,200ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. రెజర్ 40 అల్ట్రా ప్రారంభంలో ఒకే స్టోరేజ్‌లో 2 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఇప్పుడు, ఈ ఫోన్ మూడో కొత్త కలర్ ఆప్షన్ ప్రవేశపెట్టింది.

Read Also : Volvo EM90 Electric : 738కి.మీ రేంజ్‌తో కొత్త వోల్వో ఫస్ట్ ఎలక్ట్రిక్ లగ్జరీ మినీవ్యాన్.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా..!

భారత్‌లో మోటోరోలా రెజర్ 40 అల్ట్రా ధర ఎంతంటే? :
మోటోరోలా రెజర్ 40 అల్ట్రా భారత మార్కెట్లో ఒకే 8జీబీ + 256జీబీ వేరియంట్‌లో అందిస్తోంది. ఈ ఫోన్ ప్రారంభంలో రూ. 89,999, ఇన్ఫినిట్ బ్లాక్, వివా మెజెంటా కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఇప్పుడు అదనపు గ్లేసియర్ బ్లూ కలర్‌వేలో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో తక్కువ ధర రూ. 79,999కు కొనుగోలు చేయొచ్చు. మోటోరోలా ఇండియా వెబ్‌సైట్లో ఇంకా కొత్త కలర్ వేరియంట్‌ను జాబితా చేయలేదు.

మోటోరోలా రెజర్ 40 అల్ట్రా స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :

మోటోరోలా హై-ఎండ్ క్లామ్‌షెల్ ఫోల్డబుల్ 165హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ఫుల్-హెచ్‌డీ ప్లస్ పీఓఎల్‌ఈడీ అంతర్గత డిస్‌ప్లేను గరిష్ట స్థాయి 1,200 నిట్‌లను కలిగి ఉంది. ఔటర్ స్క్రీన్ 1,056×1,066 పిక్సెల్‌ల రిజల్యూషన్, 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 3.6-అంగుళాల పీఓఎల్‌ఈడీ ప్యానెల్‌ను కలిగి ఉంది.

మోటోరోలా రెజర్ 40 అల్ట్రాలోని కవర్ ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. మోటోరోలా రెజర్ 40 అల్ట్రా 4ఎన్ఎమ్ క్వాల్‌కామ్న్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్‌ఓసీతో అడ్రెనో 730 జీపీయూ, 8జీబీ ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో వచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది.

Motorola Razr 40 Ultra Variant Launch

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. రెజర్ 40 అల్ట్రాలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 12ఎంపీ ప్రైమరీ సెన్సార్ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 13ఎంపీ సెన్సార్ ఉన్నాయి. 32ఎంపీ సెన్సార్‌తో కూడిన ఇన్నర్ డిస్‌ప్లేలో కెమెరా కూడా ఉంది. మోటోరోలా రెజర్ 40 అల్ట్రాలో 30డబ్ల్యూ వైర్డ్, 5డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 3,800ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

ఈ ఫోన్ డెస్ట్, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ52 రేటింగ్‌తో వస్తుంది. మోటోరోలా ఫోల్డ్ ఓపెన్ చేశాక హ్యాండ్‌సెట్ 170.83ఎంఎం x 73.85ఎంఎం x 6.99ఎంఎం పరిమాణంలో ఉంటుంది. అయితే, ఈ ఫోన్ ఫోల్డ్ ఓపెన్ చేసినప్పుడు 88.42ఎమ్ఎమ్ x 73.95ఎమ్ఎమ్ x 15.1ఎమ్ఎమ్, స్మార్ట్‌ఫోన్ బరువు 189 గ్రాములు ఉంటుంది. భద్రత విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ కూడా ఉంది.

Read Also : Vivo X100 Series Launch : వివో X100 సిరీస్ ఫోన్ ఇదిగో.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!