Volvo EM90 Electric : 738కి.మీ రేంజ్‌తో కొత్త వోల్వో ఫస్ట్ ఎలక్ట్రిక్ లగ్జరీ మినీవ్యాన్.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా..!

Volvo EM90 Electric : వోల్వో EM90 అనేది జీకర్ 009 ప్లాట్‌ఫారమ్‌పై ఆధునిక ఎలక్ట్రిక్ మినీవ్యాన్. వోల్వో వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ మినీవ్యాన్ ఎస్‌యూవీలకు పోటీగా హైఎండ్ ఫీచర్లు, డిజైన్‌తో గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.

Volvo EM90 Electric : 738కి.మీ రేంజ్‌తో కొత్త వోల్వో ఫస్ట్ ఎలక్ట్రిక్ లగ్జరీ మినీవ్యాన్.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా..!

Volvo unveils its first-ever electric minivan EM90

Volvo unveils first-ever electric minivan EM90 MPV  : ప్రముఖ స్వీడన్ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్స్ లగ్జరీ కార్లకు పెట్టింది పేరు.. ఇప్పుడు, వోల్వో అధికారికంగా తమ మొట్టమొదటి మినీవ్యాన్ EM90 ఎలక్ట్రిక్ మోడల్ లగ్జరీ కారును ఆవిష్కరించింది. ఈ మినీవ్యాన్ మోడల్ పూర్తి ఎలక్ట్రిక్ లగ్జరీ ఎంపీవీతో వచ్చింది. ప్రధానంగా చైనీస్ మార్కెట్ల కోసం ఎలక్ట్రిక్ మినీవ్యాన్‌ను వోల్వో అభివృద్ధి చేసింది.

రానున్న రోజుల్లో ఈ మినీ వ్యాన్ ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈవీ వోల్వో స్కేలబుల్ ఎస్ఈఏ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది. వోల్వో ఈఎమ్90 మోడల్ కారు ఈఎక్స్90 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మాదిరి డిజైన్‌తో వస్తుంది. వోల్వో ఈఎమ్90 హై-ఎండ్ ఫీచర్‌లతో నిండిన ‘స్కాండినేవియన్ లివింగ్ రూమ్ ఆన్ వీల్స్’ లాంటిదని కంపెనీ పేర్కొంది.

Volvo unveils its first-ever electric minivan EM90

Volvo EM90 minivan 

వోల్వో ఈఎమ్90 అనేది వోల్వో కార్ల మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ లగ్జరీ ఎంపీవీగా చెప్పవచ్చు. కొలతల పరంగా 5,206మిల్లీమీటర్ల పొడవు, 2,024మిల్లీమీటర్ల వెడల్పు, 1,859మిల్లీమీటర్ల ఎత్తు, 3,205మిల్లీమీటర్ల వీల్‌బేస్ కలిగి ఉంది. ఈ మినీవ్యాన్‌లో మొత్తం మూడు వరుసల సీట్లలో ఆరుగురు వరకు కూర్చోవచ్చు.

Read Also : Jio AirFiber : జియో ఎయిర్‌ఫైబర్ ధర, ప్లాన్లు ఇవే.. 115 నగరాల్లో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు.. మీ ప్రాంతంలో ఉందేమో చెక్ చేసుకోండి!

వెనుక సీట్లకు స్లైడింగ్ డోర్‌లతో అందించిన ఫస్ట్ వోల్వో కారు ఇదే.. వోల్వో చైనీస్ పార్టనర్ తయారు చేసిన జీకర్ 09 ఆధారంగా రూపొందించారు. ఈ కొత్త లగ్జరీ కారు థోర్స్ హామర్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, టెయిల్‌లైట్‌ల వంటి వోల్వో కొన్ని ఐకానిక్ డిజైన్ ఫీచర్‌లతో వస్తుంది. ముందు వైపున ఫుల్ బ్రైట్‌నెస్ లోగోతో వచ్చిన ఫస్ట్ వోల్వో కారు కూడా ఇదే కావడం విశేషం.

చిన్నపాటి లగ్జరీ హోంతో వోల్వో ఈఎమ్90 :

ఈ ఎలక్ట్రిక్ ఈఎం90 కారు బయటి నుంచి కనిపించే దానికంటే.. లోపలి భాగం అన్ని విధాలుగా లగ్జరీ హోంలా మెరిసిపోతోంది. రెండో వరుసలో మసాజ్ ఫంక్షనాలిటీ, సీట్ వెంటిలేషన్, హీటింగ్ ఫీచర్లు, బిల్ట్-ఇన్ టేబుల్, కప్ హోల్డర్‌లతో లాంజ్ సీట్లు ఉన్నాయి. అదనంగా, రెండో-వరుసలో లాంజ్ సీట్లు డంపింగ్ లేయర్, 120ఎంఎం కన్నా ఎక్కువ మందంతో సహా ఏడు-లేయర్ల నిర్మాణంతో జీరో-గ్రావిటీ కుషన్‌లను కలిగి ఉంటాయి. స్లైడింగ్ బ్యాక్ డోర్, పొడవైన స్లైడింగ్ రెండో వరుస సీట్లు మూడవ వరుసకు సులభంగా యాక్సెస్‌ను అందిస్తాయి.

Volvo unveils its first-ever electric minivan EM90

Volvo electric EM90

మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు :

ఈఎం90ని కార్‌మేకర్ ‘స్కాండినేవియన్ లివింగ్ రూమ్ ఆన్ వీల్స్’గా అభివర్ణించారు. వోల్వో లగ్జరీ కారు వర్క్‌ప్లేస్ లేదా మీటింగ్ రూమ్‌గా ఉపయోగించవచ్చని భావిస్తోంది. ముందు సీటులో 15.4-అంగుళాల టచ్‌స్క్రీన్‌తో పాటు, వెనుక సీటులో ఉన్నవారికి కొంచెం పెద్ద 15.6-అంగుళాల స్క్రీన్‌ను పైకప్పు నుంచి కిందికి ఎత్తవచ్చు. బోవర్స్ అండ్ విల్కిన్స్ నుంచి మొత్తం 21 స్పీకర్లు సినిమాలు చూడటానికి లేదా మ్యూజిక్వినడానికి ఫస్ట్-క్లాస్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. ఈఎం90 అనేది పనోరమిక్ సన్‌రూఫ్‌ను కూడా అందిస్తుంది.

మొత్తం క్యాబిన్‌ను కర్టెన్‌లు, మల్టీపుల్ లైట్లతో స్కాండినేవియన్ మూడ్‌ని కలిగి ఉంటుంది. నార్తర్న్ లైట్‌లను రీక్రియేట్ సెట్టింగ్‌ల నుంచి స్వీడన్ అడవులు, సమ్మర్ థీమ్‌ల వరకు మీకు ఇష్టమైన స్కాండినేవియన్ ఎక్స్‌పీరియన్స్ ఎంచుకోవచ్చు. ఈ కారులోని సీటు అప్హోల్స్టరీ, డెకో నమూనాలు స్కాండినేవియన్, ఆసియా కళలు రెండింటి నుంచి ప్రేరణ పొందాయి. ఉదాహరణకు, సీటు అప్హోల్స్టరీపై ఉన్న నమూనా పొగమంచుతో కప్పబడిన పర్వతాలను గుర్తుచేస్తుంది. బ్యాక్‌లిట్ కలప ప్యానెల్ వెదురు అడవి నుంచి వచ్చే కాంతి కిరణాలను ప్రతిబింబిస్తుంది.

Volvo unveils its first-ever electric minivan EM90

Volvo electric minivan EM90

సింగిల్ ఛార్జ్‌తో 738కి.మీ రేంజ్ :
ఈఎం90 గరిష్టంగా 272హెచ్‌పీ ఉత్పత్తి చేసే మోటారుతో అమర్చబడి ఉంటుంది. వోల్వో కారు గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి 8.3 సెకన్లు మాత్రమే పడుతుంది. బ్యాటరీ 116కిలోవాట్స్ స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. చైనా సీఎల్‌టీసీ టెస్ట్ సైకిల్ ప్రకారం.. వోల్వో లగ్జరీ కారు సింగిల్ ఛార్జ్‌లో 738 కి.మీ రేంజ్‌తో దూసుకెళ్లగలదు. ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఈ కారు బ్యాటరీని 10శాతం నుంచి 80శాతం వరకు ఛార్జ్ చేసేందుకు సుమారు 30 నిమిషాలు పడుతుందని అంచనా.

Read Also : Apple iPhone 14 Sale : రూ. 20వేల లోపు ధరకే ఆపిల్ ఐఫోన్ 14 సొంతం చేసుకోండి.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!