×
Ad

Motorola Razr 60 Price : ఇలాంటి ఫోన్ కొనాల్సిందే.. ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా రెజర్ 60 ధర తగ్గిందోచ్.. ఈ మడతబెట్టే ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే..!

Motorola Razr 60 Price : మోటోరోలా రెజర్ 60 ధర తగ్గింది. ఈ ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.

1/6
Motorola Razr 60 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మోటోరోలా రెజర్ 60 ధర భారీగా తగ్గింది. మీరు ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. భారత మార్కెట్లో రూ. 49,999కి లాంచ్ అయిన మోటోరోలా రేజర్ 60 ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ధర రూ. 4వేల కన్నా తక్కువకు లభ్యమవుతుంది.
2/6
అత్యంత సరసమైన క్లామ్‌షెల్-స్టయిల్ ఫోల్డబుల్‌ ఫోన్లలో ఒకటిగా చెప్పవచ్చు. హింజ్ డిజైన్, పవర్‌ఫుల్ కవర్ స్క్రీన్, ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ పర్ఫార్మెన్స్ రెజర్ 60 డీల్ అసలు వదులుకోవద్దు. ఈ మోటోరోలా రెజర్ 60 ధర ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/6
మోటోరోలా రేజర్ 60 ఫ్లిప్‌కార్ట్ డీల్ : మోటోరోలా రేజర్ 60 ధర ఫస్ట్ రూ.49,999గా ఉండగా, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.39,999కే లభిస్తుంది. నేరుగా రూ.10వేలు తగ్గింపు పొందవచ్చు. అదనంగా, మోడల్, కండిషన్ ఆధారంగా యూజర్లు తమ పాత స్మార్ట్‌ఫోన్‌లపై రూ.30,550 వరకు ట్రేడ్-ఇన్ వాల్యూను పొందవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ కూడా అందిస్తోంది.
4/6
మోటోరోలా రెజర్ 60 స్పెసిఫికేషన్లు : మోటోరోలా రెజర్ 60 ఫోన్ 6.96-అంగుళాల pOLED ఇంటర్నల్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ కలిగి ఉంది. బయటి వైపు 90Hz రిఫ్రెష్ రేట్, 1,700 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 3.63-అంగుళాల pOLED కవర్ స్క్రీన్‌ కలిగి ఉంది.
5/6
ఈ మోటోరోలా ఫోన్ మీడియాటెక్ డైమన్సిటీ 7400X ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది.
6/6
మోటోరోలా రెజర్ 60 ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీ కలిగి ఉంది. కెమెరా ఫ్రంట్ సైడ్ రెజర్ 60 50MP మెయిన్ సెన్సార్, 13MP అల్ట్రావైడ్ లెన్స్‌ కలిగి ఉంది. అయితే, సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.