Motorola Razr 60 Ultra
Motorola Razr 60 Ultra : మోటోరోలా కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది. మోటోరోలా ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్ రేజర్ 60 అల్ట్రా ఫోన్ లాంచ్ చేయనున్నట్టు ధృవీకరించింది. అమెజాన్ ఇండియాలో స్పెషల్ మైక్రోసైట్, మోటోరోలా ఫోన్ ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యేకంగా అమ్మకానికి అందుబాటులోకి రానుంది.
కంపెనీ ప్రపంచంలోనే పవర్‌ఫుల్ ఏఐ ఫ్లిప్ ఫోన్‌గా తీసుకొస్తోంది. అత్యాధునిక మోటో ఏఐ సామర్థ్యాలు, ఫ్లాగ్‌షిప్ లెవల్ హార్డ్‌వేర్‌ను డిస్‌ప్లే చేస్తోంది. ఈ లాంచ్ మే 2025 చివరి నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
పాంటోన్ కలర్ ఆప్షన్లతో ప్రీమియం డిజైన్ :
అమెజాన్ ఇండియాలోని టీజర్ పేజీ ప్రకారం.. రాబోయే మోటోరోలా రేజర్ 60 అల్ట్రా 3 అద్భుతమైన పాంటోన్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.
పాంటోన్ మౌంటైన్ ట్రైల్ (బ్రౌన్)
పాంటోన్ రియో రెడ్
పాంటోన్ స్కారాబ్ (గ్రీన్)
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా) :
గ్లోబల్ మోడల్ ప్రకారం.. రాబోయే మోటోరోలా రెజర్ 60 అల్ట్రా ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.
165Hz రిఫ్రెష్ రేట్‌తో 7-అంగుళాల 1.5K pOLED LTPO ఇన్నర్ డిస్‌ప్లే
4-అంగుళాల pOLED ఎల్‌టీపీఓ కవర్ స్క్రీన్
క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoC
16GB ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ
ఫోటోగ్రఫీలో డ్యూయల్ 50MP బ్యాక్ కెమెరా (OIS ప్రైమరీ + అల్ట్రా-వైడ్) సెటప్
సెల్ఫీల కోసం 50MP షూటర్
68W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 30W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,700mAh బ్యాటరీ సపోర్టు
ఫోటోగ్రఫీ కోసం మోటో ఏఐ ఫీచర్లు
Read Also : Honda Shine 100 : కొత్త బైక్ కావాలా? హోండా షైన్ బైక్ భలే ఉంది భయ్యా.. మైలేజీలో కింగ్.. మీ బడ్జెట్ ధరలోనే..!
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా భారత్ ధర (అంచనా) :
మోటోరోలా రెజర్ 60 అల్ట్రా ధర రూ. లక్ష కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంది. మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ధరకే అందుబాటులోకి రానుంది.
ప్రీమియం స్పెషిఫికేషన్లు, ఫోల్డబుల్ డిజైన్‌తో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ సిరీస్, ఇతర ప్రీమియం ఫ్లిప్ ఫోన్‌లతో పోటీగా అందుబాటులో ఉంది.