Motorola Android 16
Motorola Android 16 : మోటోరోలా అభిమానులకు గుడ్ న్యూస్.. మోటోరోలా ఫోన్లలో ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్ రిలీజ్ అయింది. లెనోవా యాజమాన్యంలోని మోటోరోలా స్మార్ట్‌ఫోన్ లైనప్‌కు ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ రిలీజ్ చేసింది. వన్‌ప్లస్, వివో, నథింగ్, షియోమి వంటి పోటీదారుల కన్నా స్టేబుల్ అప్‌డేట్ రిలీజ్ చేసి మొదటి బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది.
ఈ అప్‌డేట్ దశలవారీగా (Motorola Android 16) రిలీజ్ కానుంది. రాబోయే వారాల్లో మరిన్ని మోటోరోలా మోడళ్లకు విస్తరించే అవకాశం ఉంది. అయితే, ఎంపిక చేసిన ప్రీమియం ఫోన్లతో పాటు అప్‌డేట్ రిలీజ్ కానుంది. మోటోరోలా ఫోన్లలో ఆండ్రాయిడ్ 16 రోల్అవుట్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మోటోరోలా ఎడ్జ్ సిరీస్‌తో ఆండ్రాయిడ్ 16 రిలీజ్ :
ఈ ఏడాది ప్రారంభంలో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో లాంచ్ అయింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో స్టేబుల్ ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్‌ను అందుకున్న ఫస్ట్ ఫోన్ ఇదే. ఆ తర్వాత, అప్‌డేట్ క్రమంగా మరిన్ని మోటోరోలా ఎడ్జ్ మోడళ్లకు వచ్చింది. ప్రస్తుతానికి, అర్హత ఉన్న మోటోరోలా ఫోన్లలోనే ఈ ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్ అందుబాటులో ఉంది. త్వరలో మరిన్ని మోడళ్లలో కూడా ఆండ్రాయిడ్ 16 రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ 16 అందుకున్న మోటోరోలా ఫోన్లు ఇవే :
* మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో
* మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్
* మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
మోటోరోలా రాబోయే రోజుల్లో మోటోరోలా ఫోన్ల జాబితాను మరింత విస్తరించనుంది. మీ మోటోరోలా ఫోన్ కొత్త అప్‌డేట్ ఇంకా అందుకోలేదా? డోంట్ వర్రీ.. దశలవారీగా అప్‌డేట్ అందుబాటులోకి రానుంది.
ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసమే కాదు.. డివైజ్ సెక్యూరిటీని మెరుగుపరుస్తుంది. సెక్యూరిటీ పరంగా కస్టమైజ్ చేసిన అనేక కొత్త ఫీచర్‌లను అందిస్తుంది. ఇందులో నోటిఫికేషన్ ఆటో గ్రూపింగ్ ఒకటి. ఈ ఫీచర్ సింగిల్ యాప్ నుంచి మల్టీ అలర్ట్స్ ఆటోమాటిక్‌గా క్లస్టరింగ్ చేసి మీ నోటిఫికేషన్ షేడ్‌ను అడ్జెస్ట్ చేస్తుంది. హియరింగ్ ఎయిడ్స్ ఉన్న యూజర్లకు ఇంప్రూవ్డ్ హియరింగ్ డివైస్ సపోర్ట్ మెరుగైన ఇంటిగ్రేషన్ అందిస్తుంది.
ముఖ్యంగా సౌండ్ ఎల్ఈ ఆడియో డివైజ్‌లకు సపోర్టు అందిస్తుంది. ఇన్‌స్టంట్ హాట్‌స్పాట్ కూడా ఉంది. సింగిల్ గూగుల్ అకౌంట్లో సైన్ ఇన్ అయ్యాక క్రోమ్‌బుక్స్, టాబ్లెట్‌లను పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయకుండానే మీ ఫోన్ హాట్‌స్పాట్‌కు ఆటోమాటిక్‌గా కనెక్ట్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 కొత్త మోడ్స్ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. వినియోగదారులు వర్క్, స్లీప్ లేదా గేమింగ్ వంటి విభిన్న కార్యకలాపాల కోసం కస్టమైజడ్ ప్రొఫైల్‌లను క్రియేట్ చేయొచ్చు.
ప్రతి మోడ్ మీరు చేసే పనికిఅనుగుణంగా నోటిఫికేషన్‌లు, యాప్ బిహేవియర్, సిస్టమ్ సెట్టింగ్స్ కంట్రోల్ చేయగలదు. సెక్యూరిటీ పరంగా మోటోరోలా అప్‌డేట్ చేసిన మోటో సెక్యూర్ 5.5 సూట్‌తో పాటు అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్‌ను అందిస్తుంది.కొత్త సెక్యూర్ పవర్-ఆఫ్ ఫీచర్ డివైజ్ పవర్ డౌన్ అయినప్పుడు అనధికార యాక్సెస్ నిరోధించి అదనపు సెక్యూరిటీని అందిస్తుంది.